PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-have-good-chance-on-three-capitals-172a478b-e9e9-42ee-b306-815f69b29900-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-have-good-chance-on-three-capitals-172a478b-e9e9-42ee-b306-815f69b29900-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అది పెద్ద సంచలన నిర్ణయం ఏదైనా ఉందంటే అది మూడు రాజధానుల ఏర్పాటు. ప్రాంతాల మధ్య గొడవలు రాకూడదని, రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చెప్పి సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నారు. అయితే పైకి అభివృద్ధి అని చెబుతున్నా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబుకే పేరు వస్తుందని, పైగా అమరావతిలో టీడీపీ హవా ఎక్కువగా ఉంటుందని చెప్పి జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు అనే విమర్శలు కూడా లేకపోలేదు. jagan;cbn;jagan;amaravati;janasena;capital;tdp;local language;ycp;janasena partyమూడు రాజధానుల ఏర్పాటులో జగన్‌కు అదిరిపోయే ఛాన్స్?మూడు రాజధానుల ఏర్పాటులో జగన్‌కు అదిరిపోయే ఛాన్స్?jagan;cbn;jagan;amaravati;janasena;capital;tdp;local language;ycp;janasena partyThu, 28 Jan 2021 04:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అది పెద్ద సంచలన నిర్ణయం ఏదైనా ఉందంటే అది మూడు రాజధానుల ఏర్పాటు. ప్రాంతాల మధ్య గొడవలు రాకూడదని, రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చెప్పి సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నారు. అయితే పైకి అభివృద్ధి అని చెబుతున్నా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబుకే పేరు వస్తుందని, పైగా అమరావతిలో టీడీపీ హవా ఎక్కువగా ఉంటుందని చెప్పి జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు అనే విమర్శలు కూడా లేకపోలేదు.

ఏదేమైనా గానీ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని, ఆ దిశగా ముందుకెళుతున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని పోరాటాలు కూడా చేశారు. అటు అమరావతి రైతులైతే 400 రోజుల పై నుంచి అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారు. రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీతో పాటు జనసేన ఇతర పార్టీలు కూడా అమరావతికి మద్ధతు ఇస్తున్నాయి.

వైసీపీ మాత్రం మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతుంది. దీంతో అమరావతి రైతులు, పలువురు రాజకీయ నాయకులు రాజధాని తరలింపుని న్యాయ వ్యవస్థల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాత్రం తన పని తనదే అన్నట్లు ముందుకెళుతున్నారు. కానీ దీనిపై చంద్రబాబు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు జగన్ రాజధాని మారుస్తానని చెప్పలేదని, కానీ గెలిచాక మూడు రాజధానులు అంటున్నారని, కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలవాలని చాలా సందర్భాల్లో బాబు సవాళ్ళు విసిరారు. కానీ అలాంటి కార్యక్రమం  ఏమి జరగలేదు.

ఇప్పుడు మాత్రం స్థానిక ఎన్నికల రూపంలో జగన్‌కు అదిరిపోయే ఛాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ గనుక ఎక్కువ స్థానాల్లో గెలిస్తే, మూడు రాజధానులకు ప్రజా ఆమోదం కూడా వచ్చినట్లు అవుతుంది. కాబట్టి దీనిపై జగన్ వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి చూడాలి స్థానిక పోరు మూడు రాజధానులకు రెఫరెండంగా ఉంటుందేమో.




హెరాల్డ్ ఎడిటోరియల్ : వార్ వన్ సైడే..జగనోరు విలవిల

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>