SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/court-notices-to-kohli-on-the-other-hand0db0bb7a-1ef8-4c0f-a3c4-df0be9e8a994-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/court-notices-to-kohli-on-the-other-hand0db0bb7a-1ef8-4c0f-a3c4-df0be9e8a994-415x250-IndiaHerald.jpgమరో ఆసక్తికర పోరు కు సర్వం సిద్దమైంది. ఇంగ్లాండ్ - భారత్ మద్య జరగనున్న నాలుగు టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు , మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తాజాగా చెన్నై చేరుకున్నారు. వీరి కంటే ముందుగానే టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులతో సహ చెన్నై చేరుకోగా జో రూట్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు బుధవారం ఇక్కడకు చేరుకొంది. ఇక చెన్నై లో ఫిబ్రవరి 5వ తేదీ నుండి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది . మొదటి రెండు టెస్ట్ లు కూడా చెన్నై లోనే జరగనున్నాయి.sports news;kerala;virat kohli;india;australia;england;high court;february;chennai;letter;icc t20ఓవైపు ఇంగ్లాండ్ తో పోరు..మరోవైపు కోహ్లీ కి కోర్ట్ నోటీసులు !!ఓవైపు ఇంగ్లాండ్ తో పోరు..మరోవైపు కోహ్లీ కి కోర్ట్ నోటీసులు !!sports news;kerala;virat kohli;india;australia;england;high court;february;chennai;letter;icc t20Thu, 28 Jan 2021 08:17:46 GMT మరో ఆసక్తికర పోరు కు సర్వం సిద్దమైంది.  ఇంగ్లాండ్ - భారత్ మద్య నాలుగు టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు , మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తాజాగా చెన్నై చేరుకున్నారు. వీరి కంటే ముందుగానే టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులతో సహ చెన్నై చేరుకోగా జో రూట్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు బుధవారం ఇక్కడకు చేరుకొంది. ఇక చెన్నై లో ఫిబ్రవరి 5వ తేదీ నుండి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది . మొదటి రెండు టెస్ట్ లు కూడా చెన్నై లోనే జరగనున్నాయి.

 లంకతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను సోమవారం ముగించుకొన్న ఇంగ్లండ్‌.. అక్కడి నుంచి నేరుగా భారత్‌కు చేరుకొంది. కాగా, ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఆదివారమే ఇక్కడకు చేరుకొని కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నారు. భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, రహానె మంగళవారం రాత్రి వచ్చారు. బుధవారం ఉదయం పుజార, బుమ్రా, పంత్‌ రాగా.. రాత్రికి విరాట్‌ చేరుకొన్నాడు. ఇరు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఏ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తుందా..అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో మొదటి టెస్ట్ అనంతరం జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి చేరాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి కేరళ హైకోర్ట్ నోటీసులు పంపడం కాస్త ఆందోళన కలిగించే విషయం. కోహ్లీ ఆన్లైన్ గెమింగ్ సంస్థ కు బ్రాండ్ అంభాసిటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కేరళలో ఆన్ లైన్ గెమింగ్ సంస్థ లను నిషేదించాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీటిని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోహ్లీ తోపాటు మరో ఇద్దరికీ కోర్ట్ నోటీసులు ఇచ్చింది.    .


జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు మొదలుపెట్టిన కొత్త తరహా రాజకీయం ?

జగడ్డ: జగనోరికి షాకిచ్చిన జర్నలిస్ట్ లు..

జ‌గ‌డ్డ : జ‌గ‌న్ స్కెచ్‌లు ఫెయిల్‌...బాబోరికి క‌లిసి రానుందా..?

జగడ్డ: జగన్ మరోసారి నిమ్మగడ్డ చేతికి చిక్కినట్టేనా..?

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ డామినేషన్ ఉందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>