Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam-movie-shooting-updatese06cd99f-1427-4c90-976d-4f3b8ef2469e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam-movie-shooting-updatese06cd99f-1427-4c90-976d-4f3b8ef2469e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా మారారు. ఈ ఏడాదిలో ప్రభాస్ తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ఈ హీరోకు అన్నీ పాన్ ఇండియా సినిమా ఆఫర్లే వస్తున్నాయి. కాగా ఏండ్ల తరబడి సినిమాలను తెరకెక్కుతుంటాయి ఈ డార్లింగ్ సినిమాలు. ఎప్పుడో సినిమాను అనౌన్స్ చేస్తే .. అవి మరెప్పుడో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక క్లారిటీ అంటూ ప్రభాస్ సినిమాల్లో దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఆ సినిమాను అన్ని విధాలుగా మెప్పించే విధంగా చేసేprabhas;prabhas;pooja hegde;krishna;krishnam raju;kushi;nag ashwin;naina;shyam;india;cinema;bahubali;naga aswin;saaho;2020;heroine;darling;vemuri radhakrishna;uv creationsవావ్ ‘రాధేశ్యామ్’సినిమా టీజర్ అప్పుడేనా?వావ్ ‘రాధేశ్యామ్’సినిమా టీజర్ అప్పుడేనా?prabhas;prabhas;pooja hegde;krishna;krishnam raju;kushi;nag ashwin;naina;shyam;india;cinema;bahubali;naga aswin;saaho;2020;heroine;darling;vemuri radhakrishna;uv creationsThu, 28 Jan 2021 13:00:00 GMTఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా మారారు. ఈ ఏడాదిలో ప్రభాస్ తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ఈ హీరోకు అన్నీ పాన్ ఇండియా సినిమా ఆఫర్లే వస్తున్నాయి. కాగా ఏండ్ల తరబడి సినిమాలను తెరకెక్కుతుంటాయి ఈ డార్లింగ్ సినిమాలు. ఎప్పుడో  సినిమాను అనౌన్స్ చేస్తే .. అవి మరెప్పుడో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక క్లారిటీ అంటూ ప్రభాస్ సినిమాల్లో దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఆ సినిమాను అన్ని విధాలుగా మెప్పించే విధంగా చేసేందుకే ఈ లేట్ అవుతూ ఉంటుందని అందరికీ తెలిసిందే. కాగా డార్లింగ్ ప్రభాస్ హీరోగా,  రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటికి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల డార్లింగ్  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో కృష్ణం రాజు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించన్నాడు.
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఈ చిత్ర యూనిట్ దాగుడు మూతలు ఆడుతూ వస్తోంది. 2020 చివర్లోనే రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేస్తామని ఈ చిత్ర యూనిట్ తెలుపగా..  కరోనా కారణంగా అదికాస్త వాయిదా పడింది. ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే.. సాహో సినిమా విడుదల కంటే ముందే సెట్స్ పైకి వెళ్లినప్పటికీ.. ఇంకా ఈ సినిమా రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. అయితే కృష్ణం రాజు మాత్రం ఈఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు.  కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంతమేర బ్యాలెన్స్ ఉంది. సో ఏప్రిల్ లో మాత్రం రిలీజ్ కావడం ఇంపాజిబులే అనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు. సినిమా ఇంకా రిలీజ్ కావడం లేదని నిరాశతో ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకే వారిని ఖుషీ చెయ్యడానికి సినిమాను రిలీజ్ చెయ్యకున్నా.. టీజర్ నైనా రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్.

సినీ వర్గాల నుంచి వస్తున్న  సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ టీజర్ ను ఈ శివరాత్రికి విడుదల చెయ్యబోతున్నారట.కాగా ఈ టీజర్ రిలీజ్ రోజునే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఉన్న అన్ని అనుమానాలకు తెర దించబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమనేది. కాగా రాధేశ్యామ్ సినిమా ఇంకా పూర్తి కాకమునుపే రెబల్ స్టార్ ఒకవైపు ఆదిపురుష్, సలార్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటుగా నాగ్ అశ్విన్ సినిమాను కూడా లైన్ లోనే పెట్టేసాడు. ఈ వరుస సినిమాలతో ప్రభాస్ ఊపిరి కూడా పీల్చలేనంత బిజీగా మారాడనిపిస్తోంది. అయితే మరీ ఆలస్యం చేస్తే రాధేశ్యామ్ పై ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ప్రేక్షకుల్లో లేకుండా పోతుందని.. మే నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.




జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: గాడ్-ఫాదర్ దే పంచాయతీ ఎన్నికలలో విజయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>