MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arundhathi-movie-child-artist-nowc57bbce4-8adf-4d39-be84-fa6a01433861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arundhathi-movie-child-artist-nowc57bbce4-8adf-4d39-be84-fa6a01433861-415x250-IndiaHerald.jpgఅనుష్క నటించిన అరుంధతి సినిమాలో చిన్నారి అరుంధతి పాత్రలో దివ్య నాగేష్ అనే ఒక కేరళ చైల్డ్ ఆర్టిస్ట్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆమె తన గంభీరమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ సినిమాలో బాగా నటించినందుకు గాను ఆమెకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా లభించింది. arundhathi movie child artist now;anoushka;krishna;nagesh;kerala;mumbai;maharashtra - mumbai;tollywood;cinema;telugu;tamil;director;maharashtra;heroine;sri reddy;father;arundhati;divya bhatnagar;fidaa;chitramఅరుంధతి చిత్రంలో చిన్నప్పటి అనుష్కగా చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తుందో.?అరుంధతి చిత్రంలో చిన్నప్పటి అనుష్కగా చేసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తుందో.?arundhathi movie child artist now;anoushka;krishna;nagesh;kerala;mumbai;maharashtra - mumbai;tollywood;cinema;telugu;tamil;director;maharashtra;heroine;sri reddy;father;arundhati;divya bhatnagar;fidaa;chitramThu, 28 Jan 2021 14:10:04 GMTఅనుష్క నటించిన అరుంధతి సినిమాలో చిన్నారి అరుంధతి పాత్రలో దివ్య నాగేష్ అనే ఒక కేరళ చైల్డ్ ఆర్టిస్ట్ నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆమె తన గంభీరమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ సినిమాలో బాగా నటించినందుకు గాను ఆమెకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా లభించింది. అయితే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా పెద్ద అయ్యారు.

అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిన్నారి అరుంధతిగా అలరించిన ఈమె ప్రస్తుత ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. 2002వ సంవత్సరం నుంచి దివ్య నాగేష్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆమె తండ్రి క్రికెటర్ కోచ్ గా పని చేసేవారు. అయితే ముంబై, మహారాష్ట్ర లో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

దివ్య తెడినెన్, వస్తావన్ వంటి పాపులర్ సినిమాల్లో కూడా నటించి వావ్ అనిపించారు. ఆమె పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. అంతేకాదు దివ్య నగేష్ తెలుగులో కూడా నేను నాన్న… అబద్దం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం తో ఆమెకు హీరోయిన్ గా ఆశించదగ్గ స్థాయి లో గుర్తింపు లభించలేదు. నేను నాన్న అబద్దం సినిమాలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి, కృష్ణుడు ప్రధాన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 40కి పైగా సినిమాల్లో నటించారు. మళ్లీ ఈ కేరళ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తే తన సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ డైరెక్టర్ ఈ చిన్నారి అరుంధతి కి ఓ మంచి ఆఫర్ ఇస్తారో చూడాలి.


జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: గాడ్-ఫాదర్ దే పంచాయతీ ఎన్నికలలో విజయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>