Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/college-released-a-circular-to-girls-to-must-have-boy-frienda8772046-8a41-4d16-8a9e-fd422c6e1478-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/college-released-a-circular-to-girls-to-must-have-boy-frienda8772046-8a41-4d16-8a9e-fd422c6e1478-415x250-IndiaHerald.jpgసాధారణంగా కాలేజీల్లో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అక్కడి టీచర్లు నానా హంగామా చేస్తారు. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ కళాసాల మాత్రం దీనికి విరుద్ధంగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. అమ్మాయిలాంత కచ్చితంగా బాయ్ ఫ్రెండ్ కలిగి ఉండాలని అందులో పేర్కొంది. వ్యాలైంటైన్స్ డే నాటికి.. valentines day;yajamanya;january;media;uttar pradesh;local language;college;lucknow;sara shrawanబాయ్ ఫ్రెండ్ లేకుంటే కాలేజీలోకి నో ఎంట్రీ!?బాయ్ ఫ్రెండ్ లేకుంటే కాలేజీలోకి నో ఎంట్రీ!?valentines day;yajamanya;january;media;uttar pradesh;local language;college;lucknow;sara shrawanWed, 27 Jan 2021 23:24:00 GMT

లక్నో: సాధారణంగా కాలేజీల్లో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అక్కడి టీచర్లు నానా హంగామా చేస్తారు. వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ కళాసాల మాత్రం దీనికి విరుద్ధంగా ఓ సర్క్యులర్ జారీ చేసినట్లున్న ఓ సర్క్యులర్ వైరల్ అవుతోంది. అమ్మాయిలంతా కచ్చితంగా బాయ్ ఫ్రెండ్ కలిగి ఉండాలనేది దాని సారాంశం. 

          

వ్యాలైంటైన్స్ డే నాటికి అమ్మాయిలంతా కనీసం ఒక్క బాయ్‌ఫ్రెండ్ అయినా కలిగి ఉండాల్సిందేనని, ఇది వాళ్ళ భద్రత కోసమేనాని యాజమాన్యం అంటున్నట్లు అందులో ఉంది. అంతేకాదు బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాలేజీలోకి అడుగుపెట్టనీయ్యమంటూ ఆ సర్క్యులర్ లో పేర్కొన్నట్లుంది. 'మీకు బాయ్‌ఫ్రండ్స్ ఉన్నారనేందుకు రుజువుగా వారితో కలిసి దిగిన ఫొటోలను కూడా మాకు చూపించాలి..’  ఈ సర్క్యులర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


దీనికి తోడు 'ప్రేమను పంచండి' అంటూ సర్యులర్ చివర ఓ సలహా కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల ప్రముఖ సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట విడుదలైనట్టు కనబడుతున్న ఈ సర్క్యులర్ ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫ్రొపేసర్ అశిశ్ శర్మ సంతకంతో జనవరి 14న ఇది జారీ అయినట్టు తెలుస్తోంది.


తొలుత విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో బయటపడ్డ ఈ ఆదేశాలు క్రమంగా సోషల్ మీడియా బాట పట్టాయి. ఈ పరిణామంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్న విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా.. ఈ వ్యవహారమంతా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లింది. దీనిపై ప్రిన్సిపాల్ ప్రొపేసర్ ఎస్పీ సింగ్ స్పందించారు. ఇది కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రొఫెసర్ అశిశ్ శర్మ అనే అధ్యాపకుడు తమ కాలేజీలో లేనే లేరని ఆయన చెప్పారు. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని, బాధ్యులను వెతికిపట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

 




సమంత, కాజల్ అక్కడ కూడా పొటీ పడుతున్నారు..!

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>