PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/elections41296d6a-84c4-4135-8aa3-f0a1656cc4d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/elections41296d6a-84c4-4135-8aa3-f0a1656cc4d8-415x250-IndiaHerald.jpgసీఎం జగన్ నాయకత్వంలోని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. జనాభాను బట్టి 5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.elections;adhithya;jagan;andhra pradesh;panchayati;population;cheque;gift;local language;ycpఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం...ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం...elections;adhithya;jagan;andhra pradesh;panchayati;population;cheque;gift;local language;ycpWed, 27 Jan 2021 07:30:00 GMTగత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిన వివాదానికి చెక్ పెడుతూ ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీఎం జగన్ నాయకత్వంలోని రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు  బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. జనాభాను బట్టి 5 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.


యితే గత ఏడాదే ఏకగ్రీవాలు అయిన పంచాయతీలకు నజరానా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, అలాగే 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది. ఇక ఇప్పుడు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఎలాంటి ఎన్నిక జరగకుండా ప్రజలంతా ఒక్క మాటపై నిలబడి సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోవడాన్నే ఏకగ్రీవం అంటారు. ఆవిధంగా ఊరి ప్రజలంతా చర్చించుకుని.. ఒకే అభిప్రాయానికి వచ్చి తమ గ్రామ నాయత్వాన్ని ఎన్నుకోవడమే ఏకగ్రీవానికి అర్ధం. ఇక ఈ ఏకగ్రీవాల వల్ల ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు, ప్రచారానికి చేసే ఖర్చులు ఉండవు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా వివిధ రకాల గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఈ రకమైన ఏకగ్రీవాల వల్ల అలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.




హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

వంశీ-కరణంలతో ఇబ్బందే... డ్యామేజ్ జరుగుతుందా?

హిందూపురంలో 'ఫ్యాన్' పాలిటిక్స్: ఫస్ట్ టైం బాలయ్యకు...?

అక్కడ టీడీపీకి ఆధిక్యం ఉందా? పంచాయితీలో సైకిల్ సవారీ ఉంటుందా?

నిమ్మగడ్డ గెలుపు జగన్‌కు కలిసొస్తుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>