PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi8b0cd93e-d541-43b6-9f68-51627749d2d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi8b0cd93e-d541-43b6-9f68-51627749d2d1-415x250-IndiaHerald.jpgసిరివెన్నెల సీతారామ శాస్త్రి.. తెలుగులో అద్భుతమైన పాట రచయిత. అన్ని రకాల పాటలు రాయడంలో ఆరితేరిన రచయిత. అలాంటి సిరివెన్నెల ప్రధాని మోడీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా రాజకీయాల జోలికి వెళ్లని ఆయన.. ప్రధాని గురించి మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారతమాత ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారతమాత ఫౌండేషన్‌ సంస్థ ఇలాంటి మహత్కర కార్యాన్ని చేపట్టడం గొప్ప విషయమన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ బాధ్యత modi;modi;ramu;sirivennela;sudhakar;india;narendra modi;g kishan reddy;telugu;prime minister;writer;minister;aqua;central government;hindus;reddy;maha;sirivennela sitaramasastri;narendra;chintala ramachandra reddyప్రధాని మోడీ గురించి "సిరివెన్నెల" షాకింగ్‌ కామెంట్స్...?ప్రధాని మోడీ గురించి "సిరివెన్నెల" షాకింగ్‌ కామెంట్స్...?modi;modi;ramu;sirivennela;sudhakar;india;narendra modi;g kishan reddy;telugu;prime minister;writer;minister;aqua;central government;hindus;reddy;maha;sirivennela sitaramasastri;narendra;chintala ramachandra reddyWed, 27 Jan 2021 00:00:00 GMTసిరివెన్నెల సీతారామ శాస్త్రి.. తెలుగులో అద్భుతమైన పాట రచయిత. అన్ని రకాల పాటలు రాయడంలో ఆరితేరిన రచయిత. అలాంటి సిరివెన్నెల ప్రధాని మోడీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా రాజకీయాల జోలికి వెళ్లని ఆయన.. ప్రధాని గురించి మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారతమాత ఫౌండేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

భారతమాత ఫౌండేషన్‌ సంస్థ  ఇలాంటి మహత్కర కార్యాన్ని చేపట్టడం గొప్ప విషయమన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ బాధ్యత నిర్వర్తించే అవకాశం కిషన్ రెడ్డికి దక్కడం.. చూసే అవకాశం దక్కడం మనమంతా ధన్యులం..అన్నారు. నేను భారతీయుణ్ణి, నేను హిందువుని.. అనే స్వాభిమానాన్ని మనమంతా కోల్పోతున్నామని సిరివెన్నెల ఆవేదన వ్యక్తం చేశారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్ర్యం  అందామా అని రాసిన నేనే.. ఓ కొత్త మార్పుని నరేంద్ర మోదీ నాయకత్వంలో చూస్తున్నానని మోదీని ఆకాశానికెత్తేశారు. మోడీ పాలనలో స్వర్ణ భారత్ ని చూస్తున్నానని మెచ్చుకున్నారు.

రాముడు అంటే మర్యాద పురుషోత్తముడని... అలాగే యువతకు కిషన్ రెడ్డి ప్రేరణగా నిలిచారని సిరివెన్నెల కామెంట్ చేశారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం జరిగింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా భారతమాత మహా హారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. భారతమాత విగ్రహం వద్ద కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత గోమాతృక దేవతారాధన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి.. గణం అంటే గ్రూపు అని..  దానినే త్రిదళం అంటారని.. మూడు దళాల శక్తిని ప్రతి భారతీయుడికి ప్రతి ఏటా గణతంత్ర రోజు తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లి నర్సింహులు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


అఖిల ఫిక్స్ అయిపోయారా?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>