PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand908638c-9ba9-4c76-ab39-c05f20df9719-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagand908638c-9ba9-4c76-ab39-c05f20df9719-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కొందరు అధికారులు కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వకపోవడంతో రాజకీయంగా ఇది సంచలనం అయింది. దీనిపై చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరు జిల్లా అధికారులపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నిన్న దేశమంతా గణతంత్ర దినోత్సవాల్లో సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. ysrcp;anam ramanarayana reddy;andhra pradesh;district;nellore;media;mla;qualification;ycp;venkatagiri;reddy;party;santoshamఅధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుఅధికారులపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుysrcp;anam ramanarayana reddy;andhra pradesh;district;nellore;media;mla;qualification;ycp;venkatagiri;reddy;party;santoshamWed, 27 Jan 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కొందరు అధికారులు కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వకపోవడంతో రాజకీయంగా ఇది సంచలనం అయింది. దీనిపై చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరు జిల్లా అధికారులపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

నిన్న దేశమంతా గణతంత్ర దినోత్సవాల్లో సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.  జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలకు ఆ సంతోషం దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకి చోటు దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.  మాకు అర్హత లేదా? అని ఆయన నిలదీశారు. దీనికి మేము సిగ్గుపడాలో, ఏమి చేయాలో అర్థం కావడంలేదు అని అన్నారు. నెల్లూరులో రిపబ్లిక్ డే పెరేడ్ జరిగితే, ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు అని మండిపడ్డారు. 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నాకు చాలా సిగ్గుచేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

అధికారుల నిర్లక్ష్యమా లేక అహంకారమా? అని ప్రశ్నించారు.  ఎందుకు మమ్మల్ని పిలవలేదు అంటే, అధికారుల దగ్గర సమాచారం లేదు అని అన్నారు. జిల్లా ప్రోటోకాల్ అధికారిని అడిగితే, మేము చిన్నవాళ్ళం, మీకు సమాదానం చెప్పలేం అన్నారు అని అన్నారు. అధికారులు... మీ ఇన్విటేషన్లు ఉన్నాయి. పక్కన పెట్టమన్నారని చెప్పారు అని... ఇంత నిర్లక్ష్యంతో అధికారులు జిల్లాలో ఉండడం గర్హనీయం అని విమర్శలు చేసారు. దీనిపై రాష్ట్ర ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను అని ఆయన అన్నారు. రాజ్యాంగ పరంగా నన్ను రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా ఆమానించిన అధికారులపై కేసులు వేస్తాను అని స్పష్టం చేసారు.


రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>