MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1788e2da-aeea-40c5-90f2-1505205ad748-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1788e2da-aeea-40c5-90f2-1505205ad748-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి మలయాళం సినిమా అయిన అయ్యప్పనుం కొషియం రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ప్రకారం ఇద్దరూ పోటాపోటీగా సినిమా క్లైమాక్స్ వరకు పోరాడుతారు. వీరిద్దరి మధ్య ఒక ఫైట్ కూడా ఉంటుంది. ఒరిజినల్ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా నిలిచింది. నెగిటివ్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ ఒక లాడ్జి లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లి బిజు మీనన్ అతనితో గొడవపడే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు అలాంటిదే ఒక భారీ లాడ్జ్ సెట్ ని మన వాళ్ళు హైదరాబాtollywood;pawan;venkatesh;rana;biju menon;aishwarya;aishwarya rajesh;dileep;dilip;kalyan;pawan kalyan;sithara;tara;hyderabad;cinema;remake;daggubati venkateswara rao;heroine;amarnath k menon;sai pallaviఅయ్యప్పనుం కొషియం రీమేక్ మీద అంచనాలు పెంచేస్తోన్న లాడ్జ్ ఫైట్..అయ్యప్పనుం కొషియం రీమేక్ మీద అంచనాలు పెంచేస్తోన్న లాడ్జ్ ఫైట్..tollywood;pawan;venkatesh;rana;biju menon;aishwarya;aishwarya rajesh;dileep;dilip;kalyan;pawan kalyan;sithara;tara;hyderabad;cinema;remake;daggubati venkateswara rao;heroine;amarnath k menon;sai pallaviWed, 27 Jan 2021 17:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి మలయాళం సినిమా అయిన అయ్యప్పనుం కొషియం రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ప్రకారం ఇద్దరూ పోటాపోటీగా సినిమా క్లైమాక్స్ వరకు పోరాడుతారు. వీరిద్దరి మధ్య ఒక ఫైట్ కూడా ఉంటుంది. ఒరిజినల్ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా నిలిచింది. నెగిటివ్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ ఒక లాడ్జి లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్లి బిజు మీనన్ అతనితో గొడవపడే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు అలాంటిదే ఒక భారీ లాడ్జ్ సెట్ ని మన వాళ్ళు హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేశారు. 


సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నట్లుగా కొద్ది రోజుల క్రితమే యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫైట్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఫేమస్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన దిలీప్ సుబ్బరాయన్ ఈ ఫైట్ ని కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ దాదాపుగా పది రోజుల పాటు జరుగుతుందని ఈ షెడ్యూల్ పూర్తయ్యాక యూనిట్ అంతా కేరళలోని పొల్లాచ్చిలో వెళతారని చెబుతున్నారు. మిగతా భాగం అంతా దాదాపుగా అక్కడే షూట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 


ఇక ఈ సినిమాని అప్పట్లో ఒకడుండేవాడు సినిమా దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి అలాగే ఐశ్వర్య రాజేష్ ఇద్దరిని హీరోయిన్స్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వెలువడితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.


చెన్నై చేరుకున్న ఆ ముగ్గురు..!!

మరో సారి బాక్సాఫీస్ లో షేక్ చేయడానికి సిద్దమైన ‘జైలవకుశ’.. వామ్మో టికెట్లేంటి ఇలా అమ్ముడుపోతున్నాయి..

'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!

పవన్ కల్యాణ్ కు చిరు మద్దతు.. మళ్లీ ఒక్కటి కానున్నారా?

హన్సిక సినిమాల్లోకి రావడానికి ఆ పని చేసిందా.? నాలుగేళ్లలో ఇంత మార్పుకు కారణం అదేనా..?

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>