PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-ni-target-chesina-jaggareddy-keelaka-vyakyaluc431f9ff-0782-4e30-aba9-fe34926ff063-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-ni-target-chesina-jaggareddy-keelaka-vyakyaluc431f9ff-0782-4e30-aba9-fe34926ff063-415x250-IndiaHerald.jpgఇటీవలే భారత తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తాజాగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దేశపు మొదటి ప్రధాని నెహ్రూనే విమర్శించేంతటోడివా ? అసలు నీ బతుకెంత అంటూ మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం కోసం ఆస్తులు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబంపై కేసీఆర్‌కి చెంచాగిరీ చేసే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడమేంటని ఆయన ఎద్దేవా చేశారు.ఇదేమన్నా కేసీఆర్‌కి విస్కీలో సోడా కలిపి ఇవ్వడమనుకుంటున్నవ ఎట్ట ?jaggareddy;kumaar;vidya;telangana rashtra samithi trs;bandara;telangana;congress;telugu;prime minister;electricity;history;tpcc;mla;minister;kusuma jagadish;jagga reddy;reddy;partyవిస్కీలో సోడా కలిపే నువ్వు... నెహ్రూని విమర్శించేంతటోడివా ? - మంత్రిపై జగ్గారెడ్డి ఫైర్విస్కీలో సోడా కలిపే నువ్వు... నెహ్రూని విమర్శించేంతటోడివా ? - మంత్రిపై జగ్గారెడ్డి ఫైర్jaggareddy;kumaar;vidya;telangana rashtra samithi trs;bandara;telangana;congress;telugu;prime minister;electricity;history;tpcc;mla;minister;kusuma jagadish;jagga reddy;reddy;partyWed, 27 Jan 2021 20:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ లీడర్లలో జగ్గారెడ్డి శైలి విభిన్నం. ఆయనకు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఎప్పటినుండో ఉందన్న సంగతి తెలిసిందే. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఆ ఫైరింగ్ మాటల తూటాలకు పదును తగ్గించారు. ఎప్పుడో చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇటీవలే భారత తొలి ప్రధాని నెహ్రూపై విమర్శలు చేసిన టీఆర్ఎస్ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తాజాగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దేశపు మొదటి ప్రధాని నెహ్రూనే విమర్శించేంతటోడివా ? అసలు నీ బతుకెంత అంటూ మంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగ్గారెడ్డి. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం కోసం ఆస్తులు త్యాగం చేసిన నెహ్రూ కుటుంబంపై కేసీఆర్‌కి చెంచాగిరీ చేసే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఈ జగదీష్ రెడ్డి అనేవాడు ఎక్కడుండేవాడని ఆయన ప్రశ్నించారు.



 అలాగే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖకు మంత్రి కావచ్చు.. కానీ ఆయన బాడీలో పవర్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు నీ చరిత్ర ఏంది ? పొలిటికల్‌గా నీ హిస్టరీ ఏంది అంటూ ప్రశ్నించారు. ఉత్తమ్ ఓ కెప్టెన్.. రాష్ట్రపతి దగ్గర కీలక పదవిలో పనిచేసినోడు ఆయన.. నువ్వొక చిన్న వకాలత్ చేసుకునేటోడివి. నువ్వు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎట్లా ? ఇదేమన్నా రాత్రిపూట కేసీఆర్‌కి విస్కీలో సోడా కలిపి ఇవ్వడమనుకుంటున్నవ ఎట్ట ? అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌కి చెంచాగిరీ చేస్తే చేసుకో కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. తాము తిట్టడం మొదలుపెడితే బయట తిరగగలవా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంత్రిని అనుకుంటున్నవేమో.. నీ అసంటోళ్లని చాలామందిని చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ శాఖలో జరిగిన అవినీతి మొత్తం బయటికి తీస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. జగదీశ్వర్ రెడ్డి ఏంటో తనకు బాగా తెలుసని.. త్వరలో అతని బండారం బయటపెడతానని ఆయన శైలిలో తీవ్రంగా స్పందించారు.


రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>