PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-given-new-powers-to-surpanchsed7c0e12-5274-486e-9bbe-4aa93716036a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-govt-given-new-powers-to-surpanchsed7c0e12-5274-486e-9bbe-4aa93716036a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సర్పంచులకు కొత్త అధికారాలు లభించాయి. గ్రామాల్లో సంచరించే పందుల డ్యూటీ వాళ్లకు లభించింది. అంటే గ్రామంలో సంచరించే పందులపై పెత్తనం అన్నమాట. పంచాయతీ పరిధిలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్‌గా వ్యవహరించడానికి సర్పంచులకు అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చింది. పంటలకు నష్టం చేస్తున్న అడవి పందులను వేటాడేందుకు, చంపేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.sasikala;manu;rakshita;district;panchayati;village;local languageసర్పంచ్ లకు కొత్త అధికారాలుసర్పంచ్ లకు కొత్త అధికారాలుsasikala;manu;rakshita;district;panchayati;village;local languageWed, 27 Jan 2021 08:56:05 GMTపంచాయతీ పరిధిలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్‌గా వ్యవహరించడానికి సర్పంచులకు అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చింది. పంటలకు నష్టం చేస్తున్న అడవి పందులను వేటాడేందుకు, చంపేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. అడవులు, రక్షిత ప్రదేశాలు, రిజర్వు ఫారెస్టుకు వెలుపల ఉన్న ప్రాంతాలలో మాత్రమే అడవి పందులను వేటాడేందుకు సర్పంచ్‌లకు ఈ అధికారాలు ఇస్తున్నట్టు చెప్పారు.


         పంటలకు నష్టం కలిగిస్తున్నట్లు రైతుల నుంచి లేదా స్థానిక ప్రజల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు వస్తేనే సర్పంచ్ స్పందించాలి. ఫిర్యాదు వచ్చిన తర్వాత గ్రామ పెద్దలతో చర్చించాలి. నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లి పంట నష్టంపై పంచానామా జరపాలి. అడవి పందుల్ని చంపేయాలనే అభిప్రాయం వస్తే ఆ సిఫారసును పంచానామాలో పేర్కొనాలి. అడవి పందులను వేటాడి చంపేందుకు సర్పంచ్ నిర్ణయం తీసుకుని లిఖితపూర్వకంగా ఫారెస్టు బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌లకు అందజేయాలి. వాటిని వేటాడేందుకు షూటర్ల సాయం తీసుకోవాలి. షూటింగ్‌కు ఉపయోగించే తుపాలకు లైసెన్సు ఉందో లేదో, ఆ షూటర్లు అటవీ శాఖ ప్యానెల్‌లో ఉన్నారో లేదో తేల్చాలి. వేటాడే సమయంలో ఇతర వన్యప్రాణులకు, మనుషులకు ప్రాణనష్టం కలగకుండా సర్పంచ్ బాధ్యత వహించాలి. పంటలకు మరింత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడవులు, రక్షిత ప్రదేశాలు, రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో వేటాడకూడదు. చనిపోయిన పంది కళేబరాన్ని భూమిలో పాతిపెట్టాలి. వాటి చర్మాన్ని, మాంసాన్ని వినియోగించుకోకూడదు.

         ఈ ప్రక్రియలో అటవీశాఖకు చెందిన సిబ్బందిలో కనీసం ఒక్కరైనా ఉండేలా సర్పంచ్ చూసుకోవాలి. పంది చనిపోయిన తర్వాత నిర్వహించిన పంచనామా రిపోర్టును ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌కు అందజేయాలి. రేంజ్ ఆఫీసర్ సైతం దాని ఆధారంగా నివేదిక తయారు చేసి జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించాలి. వేటాడే క్రమంలో ఇతర వన్యప్రాణులకు, మనుషులకు నష్టం జరిగితే అందుకు షూటర్‌దే బాధ్యత. అటవీ శాఖ సిబ్బంది ఇందుకు బాధ్యత వహించరు.




మరో సినిమా అనౌన్స్ చేయనున్న చిరు.. డైరెక్టర్ ఆయనే !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?

ఆ వైసీపీ ఎమ్మెల్యే దోపిడీలు, భూక‌బ్జాల‌కు అంతేలేదా ?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>