EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chandrababu-jagan-nimmagadda-election-commissiondd3f366b-68e1-4124-9e0c-c9d3dd664f2f-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల సమయంలో ఏమి జరిగిందో కాస్త గుర్తు చేసుకుందాం. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దాంతో చంద్రబాబు కమీషన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. అప్పటి చీఫ్ సెక్రటరీ పునేతతో కేంద్ర ఎన్నికల కమీషనర్ కు పెద్ద లెటర్ రాయించారు. అంతే కాకుండా కోర్టులో కేసు కూడా వేయించారు. దాంతో ఒళ్ళుమండిన కమీషన్ పునేతను ఢిల్లీకి పిలిపించుకుని గట్టిగా తలంటిపోసింది. దాంతో వేరే దారిలేక హైదరాబాద్ కు తిరిగొచ్చిన పునేత వెంటనే ఏబీని బదిలీ చేశారు. తన ఆదేశాలను ధికchandrababu jagan nimmagadda election commission;cbn;hyderabad;jagan;n. chandrababu naidu;2019;court;industry;letter;central government;ycp;l v subramanyam;lv subramaniam;reddy;anandamహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఈపని చేయటమంటే భలే ఆనందంహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఈపని చేయటమంటే భలే ఆనందంchandrababu jagan nimmagadda election commission;cbn;hyderabad;jagan;n. chandrababu naidu;2019;court;industry;letter;central government;ycp;l v subramanyam;lv subramaniam;reddy;anandamWed, 27 Jan 2021 03:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు నీతులు చెప్పటమంటే భలే ఆనందంగా ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లాంటివన్నీ ప్రతిపక్షంలోకి రాగానే భలే గుర్తుకువస్తాయి. పంచాయితి ఎన్నికలపై తాజాగా సుప్రింకోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు, యనమల అండ్ కో విపరీతంగా రెచ్చిపోతున్నారు. సర్వ వ్యవస్ధలను జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశారట. జగన్ కు రాజ్యాంగమన్నా, చట్టమన్నా, ప్రజాస్వామ్యమన్నా ఏమాత్రం లెక్కలేదట. ఇలాంటి ఆరోపణలతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది ఎల్లోబ్యాచ్. అవకాశం వచ్చింది కదాని రెచ్చిపోతున్న వీళ్ళంతా తాము అధికారంలో ఉన్నపుడు ఏమి చేశారన్నదే ఇపుడు పాయింట్.




2019 ఎన్నికల సమయంలో ఏమి జరిగిందో కాస్త గుర్తు చేసుకుందాం. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దాంతో చంద్రబాబు కమీషన్ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. అప్పటి చీఫ్ సెక్రటరీ పునేతతో కేంద్ర ఎన్నికల కమీషనర్ కు పెద్ద లెటర్ రాయించారు. అంతే కాకుండా కోర్టులో కేసు కూడా వేయించారు.  దాంతో ఒళ్ళుమండిన కమీషన్ పునేతను ఢిల్లీకి పిలిపించుకుని గట్టిగా తలంటిపోసింది. దాంతో వేరే దారిలేక హైదరాబాద్ కు తిరిగొచ్చిన పునేత వెంటనే ఏబీని బదిలీ చేశారు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు కమీషన్ పునేతాను కూడా హఠాత్తుగా బదిలీచేసేసింది. పునేత స్ధానంలో ఎల్వీ సుబ్రమణ్యంను చీఫ్ సెక్రటరీగా నియమించింది. దాన్ని తట్టుకోలేని చంద్రబాబు అండ్ కో కమీషన్ను, వైసీపీ నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.




చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అప్పటి ఎన్నికల కమీషన్ సిసోడియాపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపిన కమీషన్ వెంటనే ఆయన్ను బదిలీచేసి ఆ స్ధానంలో కమీషనర్ గా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది.  తనకిష్టం లేని వ్యక్తులు చీఫ్ సెక్రటరీ, కమీషనర్ గా నియమితులైనందుకు చంద్రబాబు ఎంత గోల చేశారో అందరికీ తెలిసిందే. ఎల్వీని ప్రతి విషయంలోను చంద్రబాబు అండ్ కో నానా గోల చేసినవారే. ఒకసారైతే కమీషన్ కార్యాలయానికి చంద్రబాబు వెళిపోయి కమీషనర్ తో ఎంత గొడవపడ్డారో ? ఎంతగా బెదిరించారో అందరికి తెలుసు. కమీషన్ కార్యాలయం ముందు చంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ధర్నానే జరిగింది. ఇలాంటి చంద్రబాబు ఇపుడు జగన్ కు నీతులు, బుద్దులు చెబుతున్నారు.




బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>