PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections473bfd97-778a-4d70-ac44-a297b672bd26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections473bfd97-778a-4d70-ac44-a297b672bd26-415x250-IndiaHerald.jpgపంచాయతీ సమరం మొదలైపోయింది. పల్లెల్లో హోరు మామూలుగా లేదు. బస్తీ మే సవాల్ అటూ అటూ ఇటూ మోహరించి ఉన్నారు. సర్పంచ్ పదవి ఇపుడు ప్రధానమంత్రి పదవితో సమానం. ఆ పీఠం దక్కించుకోవడానికి ఎవరి మటుకు వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. jagan-nimmagadda-elections;telugu desam party;2019;district;telugu;vishakapatnam;panchayati;prime minister;mla;fort;tdp;ycp;izzat;party;mantraజగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?jagan-nimmagadda-elections;telugu desam party;2019;district;telugu;vishakapatnam;panchayati;prime minister;mla;fort;tdp;ycp;izzat;party;mantraWed, 27 Jan 2021 19:00:00 GMTపంచాయతీ సమరం మొదలైపోయింది. పల్లెల్లో హోరు మామూలుగా లేదు. బస్తీ మే సవాల్ అటూ అటూ ఇటూ మోహరించి ఉన్నారు. సర్పంచ్ పదవి ఇపుడు ప్రధానమంత్రి పదవితో సమానం. ఆ పీఠం దక్కించుకోవడానికి ఎవరి మటుకు వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.

విశాఖ జిల్లాలో మొత్తం 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నూటికి తొంబై శాతం 2013లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లా కంచుకోట. ఎపుడూ ఓటమి ఎరుగని జిల్లా ఇది. టీడీపీ ఎన్నో సార్లు ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఈ జిల్లా ఎపుడూ కొమ్ము కాస్తూనే ఉంది. అయితే 2019 ఎన్నికలలో మాత్రం విశాఖ రూరల్ జిల్లా, ఏజెన్సీ అన్నీ కలిపి 11 ఎమ్మెల్యే సీట్లు పూర్తిగా వైసీపీ పరం అయ్యాయి. ఇక సిటీలోని నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది.

ఇపుడు పంచాయతీలు అన్నీ కూడా రూరల్ జిల్లాలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేల ఆధిపత్యేమే. ఉంది. ఇక విశాఖ రూరల్ లో వైసీపీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కానీ టీడీపీకి మాత్రం మాజీ మంత్రులు, బలమైన నాయకుల బలం క్షేత్ర స్థాయిలో ఉంది. టీడీపీ 2019 ఎన్నికల్లో ఓడడానికి కారణం క్యాడర్ పూర్తిగా సహకరించకపోవడేమే.

గడచిన ఇరవై నెలలలో చూసుకుంటే టీడీపీ బలోపేతమైంది. క్యాడర్ కూడా ఓడిన తరువాత ఆ బాధ ఏంటో తెలుసుకున్నారు. నాయకులు కూడా అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ఓ విధంగా టీడీపీకి గత వైభవం తీసుకురావాలన్న ఆలోచన పార్టీ కార్యకర్తలలో ఉంది. అదే సమయంలో వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సీన్ ఉంది. ఈ నేపధ్యంలో చేతిలో అధికారం ఉన్నా కఠినమైన ఎన్నికల నిబంధనల వల్ల ఉపయోగం లేదు క్యాడర్ ని ఇరవై నెలలుగా పట్టించుకోకపోవడంతో వారు నిరుత్సాహంగా ఉన్నారు. మరి ఇపుడు కనుక వైసీపీ 2019 నాటి మ్యాజిక్ ని కొనసాగించకపోతే మాత్రం దారుణమైన పరాభవమే మిగులుతుంది అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఏం చేస్తుందో.




రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!

మనసుకు నచ్చకపోయినా ఆ పని చెయ్యాల్సిందే : ఆమని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>