PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder7b8bbd31-bc35-4b1b-8bf8-4f469323cd7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder7b8bbd31-bc35-4b1b-8bf8-4f469323cd7b-415x250-IndiaHerald.jpgమన చుట్టూనే తిరుగుతూంటారు. మామూలుగానే ఉంటారు. కానీ వారి గురించి నిజాలు తెలిసినప్పుడే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి నేరస్తుడొకరు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ప్రశ్నిస్తే.. తానేం తప్పు చేయలేదన్నట్లుగా చేసిన నేరాలన్నింటినీ బయట పెట్టడంతో పోలీసులూ షాక్‌కు గురయ్యారు .హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 16 మంది మహిళలను అతి కిరాతకంగా చంపిన ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు అలా మహిళల్ని టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలిscico;women;madhavan;jeevitha rajaseskhar;ramu;tiru;hyderabad;district;police;television;marriage;petrol;wife;woman;police station;arrest;murder.;traffic police;sangareddy;pettaనిశ్శబ్దం లో మాధవన్ ను ఫాలో అయిన హైదరాబాద్ సైకో... ఎలానో తెలుసా...?నిశ్శబ్దం లో మాధవన్ ను ఫాలో అయిన హైదరాబాద్ సైకో... ఎలానో తెలుసా...?scico;women;madhavan;jeevitha rajaseskhar;ramu;tiru;hyderabad;district;police;television;marriage;petrol;wife;woman;police station;arrest;murder.;traffic police;sangareddy;pettaWed, 27 Jan 2021 09:44:05 GMTహైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ప్రశ్నిస్తే.. తానేం తప్పు చేయలేదన్నట్లుగా చేసిన నేరాలన్నింటినీ బయట పెట్టడంతో పోలీసులూ షాక్‌కు గురయ్యారు .హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 16 మంది మహిళలను అతి కిరాతకంగా చంపిన ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు అలా మహిళల్ని టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలిసింది. మంగళవారం ఈ కేసు విషయమై పోలీసులు పలు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు.


హైదరాబాద్ శివారులో అంకుషాపూర్ అనే గ్రామం దగ్గర ఓ మహిళ హత్యకు గురయింది. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉంది. పోలీసులకు ఓ చిన్న క్లూ దొరకడంతో దాని ఆధారంగా కొద్ది కొద్దిగా కూపీ లాగడం ప్రారంభించారు. చివరికి… అసలు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి వద్దకు ఆ కూపీ చేరింది. అతన్ని ప్రశ్నిస్తే…అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె మద్యం దుకాణం వద్ద ఒంటరిగా కనిపించింది. కలిసి మద్యం తాగుదామంటూ… ఓ బాటిల్ కొని… గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆమెను అక్కడే చంపేసి.. పెట్రోల్ పోసి తగులపెట్టి వచ్చేశాడు. అంతకు ముందు ఆ మహిళతో కనీస ముఖ పరిచయం కూడా లేకపోవడంతో… అతనిపై అనుమానపడేవారు కూడా ఎవరూ లేరు . కానీ మద్యం దుకాణం దగ్గర.. ఆటో ఎక్కుతున్న సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలే పట్టించాయి.

సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు అలియాస్ తలారీ అలియస్ సాయిలు స్టోన్ కటర్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. హైదరాబాద్ లోని బోరబండలో నివసించేవాడు. అతడి మొదటి భార్య పెళ్లయిన పదిహేను రోజులకే వేరొకరితో వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురం తర్వాత విబేధాలు వచ్చి ఇద్దరు పిల్లలతో సహా రెండో భార్య వేరుగా ఉంటోంది. ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అంతే ఆ ఘటనతో మహిళలపై కోపం పెంచుకున్నాడు. జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న భార్యలపై అసహ్యం పెంచుకున్నాడు. 2003వ సంవత్సరంలో తూఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాను సహజీవనం చేసిన మహిళను హత్య చేశాడు.దుండిగల్, బోయిన్ పల్లి పరిధిలో ముగ్గురిని చంపేశాడు. శామీర్ పేట, పటాన్ చెరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మహిళలను హతమార్చాడు. ఇలా వరుసగా 16 హత్యలు చేశాడు. ఈ క్రమంలోనే రాములు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన భవన నిర్మాణ కూలీ. 15 రోజుల క్రితం అంకుశాపూర్‌ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది.సిద్ధిపేట, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోటు చేసుకున్న రెండు హత్యల కేసుల్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు అతడిపై 21 కేసులు ఉండగా, వాటిలో 16 హత్య కేసులే కావడం గమనార్హం.


రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>