PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/telangana-dscea8eebdb-c9c9-4985-aaa6-95d0e8b490d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/telangana-dscea8eebdb-c9c9-4985-aaa6-95d0e8b490d0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఉద్యోగాల భర్తీకోసం సీఎం కేసీఆర్ వరమిచ్చినా.. ఉన్నతాధికారులు మాత్రం పోస్ట్ ల భర్తీ ప్రక్రియను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో వేలమంది ఉపాధ్యాయ ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2014లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. టెట్ నిర్వహించారు. ఈ అర్హత ఉంటేనే డీఎస్సీ రాయడానికి అర్హులుగా పరిగణిస్తారు. అయితే టెట్ ఎలిజిబిలిటీ కేవలం ఏడేళ్లు మాత్రమే. అంటే 2014లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులు ఈ ఏడాది డీఎస్సీ ఆలస్యంగా పెడితే నష్టపోతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నtelangana dsc;kcr;tara;job;letter;qualification;applicationకేసీఆర్ వరమిచ్చినా.. అధికారులు కరుణించడంలేదు..కేసీఆర్ వరమిచ్చినా.. అధికారులు కరుణించడంలేదు..telangana dsc;kcr;tara;job;letter;qualification;applicationWed, 27 Jan 2021 11:00:00 GMTకేసీఆర్ వరమిచ్చినా.. ఉన్నతాధికారులు మాత్రం పోస్ట్ ల భర్తీ ప్రక్రియను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో లక్షల  మంది ఉపాధ్యాయ ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2014లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. టెట్ నిర్వహించారు. ఈ అర్హత ఉంటేనే డీఎస్సీ రాయడానికి అర్హులుగా పరిగణిస్తారు. అయితే టెట్ ఎలిజిబిలిటీ కేవలం ఏడేళ్లు మాత్రమే. అంటే 2014లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులు ఈ ఏడాది డీఎస్సీ ఆలస్యంగా పెడితే నష్టపోతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయ పోస్ట్ ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు.

ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్ పరీక్ష‌ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలో కొత్తగా బీఈడీ, డీఈడీ చేసిన 1.5 లక్షల మంది అభ్యర్థులు అసలు టెట్‌ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ పరీక్షకోసం ఎదురు చూస్తున్నారు. ఇది పాసయితేనే వీరంతా డీఎస్సీకి అర్హులవుతారు.

తెలంగాణలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్ ఇదివరకే ఆదేశాలిచ్చారు. దీని ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీలను సైతం లెక్కగట్టి నివేదిక సమర్పించారు అధికారులు. అయితే టెట్ నిర్వహణలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగంకోసం ఎదురు చూస్తున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో టెట్‌ నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్‌ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు డీఎస్సీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. విద్యాశాఖ పదోన్నతుల ప్రక్రియ కూడా పూర్తయితేనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది.


పూరీ మనసంతా అక్కడే.. అందుకోసమే లైగన్ ను అక్కడే సెట్ చేయనున్నాడు..

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>