PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/successful-water-sprinkled-on-hopes-8c1dc123-b27a-41d3-9be8-80493f8117ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/successful-water-sprinkled-on-hopes-8c1dc123-b27a-41d3-9be8-80493f8117ce-415x250-IndiaHerald.jpgబీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 24 ఏళ్లైంది. 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఉన్న ఫొటోను ఆమె జత చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సినీనటిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశాvijayashanthi;amitabh bachchan;vijayashanti;jeevitha rajaseskhar;nayana harshita;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;congress;cinema;rajani kanth;media;tamil;prime minister;loksabha;kannada;assembly;hindi;venkaiah naidu;party;prasthanamరాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...vijayashanthi;amitabh bachchan;vijayashanti;jeevitha rajaseskhar;nayana harshita;ramu;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;congress;cinema;rajani kanth;media;tamil;prime minister;loksabha;kannada;assembly;hindi;venkaiah naidu;party;prasthanamWed, 27 Jan 2021 20:41:57 GMTబీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 24 ఏళ్లైంది. 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఉన్న ఫొటోను ఆమె జత చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. సినీనటిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత సొంతంగా తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశారు. టీఆర్ఎస్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా పనిచేశారు.


ఇటీవలే తిరిగి బీజేపీ గూటికి చేరారు. ఓ వైపు సినిమా రంగంలో కొనసాగుతూనే 1998లో ఆమె బీజేపీలో చేరారు. 2005లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కమలం పార్టీని వీడి ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. కొంతకాలానికే తన పార్టీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు.  2012 నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌తో విభేదాలతో టీఆర్‌ఎ్‌సకు దూరంగా ఉన్నారు. 2013లో ఆ పార్టీని వీడిన రాములమ్మ.. తెలంగాణ ఆవిర్భావం అనంతరం కాంగ్రె్‌సలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. 2018లోనూ పోటీ చేయాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమిరా అన్నారు.


ఇక సినీ జీవితం విష‌యానికి వ‌స్తే తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్", "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది.ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.  ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 


జగడ్డ : అదే జరిగితే బాబోరి పార్టీకి భారీ షాకే ?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>