PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections019edd0f-473c-48ef-94c1-a83924484f45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections019edd0f-473c-48ef-94c1-a83924484f45-415x250-IndiaHerald.jpgఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో జగన్ సర్కారు శత్రుత్వం సంగతి తెలిసిందే. ఈ పంచాయతీ ఎన్నికల పంచాయితీ చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అక్కడ కూడా మొట్టికాయలు పడటంతో ఇప్పుడు జగన్ సర్కారు తలవంచక తప్పలేదు. చివరకు ఎన్నికలకు సహకరిస్తామని ప్రకటించేసింది కూడా. దీంతో క్రమంగా మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పాలి.. ఈ సమయంలో మరోసారి జగన్ సర్కారు తెగించినట్టు కనిపిస్తోంది. అదేంటంటే.. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు పెద్ద ఎత్తున జగన్ సర్కారు నజరానా ప్రకటించింది. ఓవైపున ఎన్నికల సంఘంతో పరిస్థితులjagan-nimmagadda-elections;kumaar;jagan;panchayati;population;prize;gift;shatru1జగడ్డ: జగన్ సర్కారు మళ్లీ తెగించింది.. నిమ్మగడ్డ ఊరుకుంటారా?జగడ్డ: జగన్ సర్కారు మళ్లీ తెగించింది.. నిమ్మగడ్డ ఊరుకుంటారా?jagan-nimmagadda-elections;kumaar;jagan;panchayati;population;prize;gift;shatru1Wed, 27 Jan 2021 08:09:30 GMTజగన్ సర్కారు శత్రుత్వం సంగతి తెలిసిందే. ఈ పంచాయతీ ఎన్నికల పంచాయితీ చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అక్కడ కూడా మొట్టికాయలు పడటంతో ఇప్పుడు జగన్ సర్కారు తలవంచక తప్పలేదు. చివరకు ఎన్నికలకు సహకరిస్తామని ప్రకటించేసింది కూడా. దీంతో క్రమంగా మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పాలి.. ఈ సమయంలో మరోసారి జగన్ సర్కారు తెగించినట్టు కనిపిస్తోంది.

అదేంటంటే.. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు పెద్ద ఎత్తున జగన్ సర్కారు నజరానా ప్రకటించింది. ఓవైపున ఎన్నికల సంఘంతో పరిస్థితులు చక్కబడుతున్న సమయంలో జగన్ సర్కారు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం ఒక విధంగా సాహసమే అనుకోవాలి. అయితే ఇదేమీ కొత్త కాదు.. ఇటీవల తెలంగాణలోనూ ఇదే చేశారు.. కానీ.. నిమ్మగడ్డ ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని ప్రకటించిన తర్వాత.. అందులోనూ నామినేషన్లకు సరిగ్గా మూడు రోజుల ముందు చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

ఇలాంటి నజరానాల కారణంగా పల్లెల్లో శాంతి నెలకొంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రకటనతో చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతాయని.. శాంతియుతంగా జరిగిన ఏకగ్రీవాలకే నజరానా ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. జనాభా ప్రాతిపదికన రూ.20లక్షల వరకు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు, 10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అయితే బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్నది నిమ్మగడ్డ ఆరోపణ. అలాంటి వాటిని నిరోధించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏకగ్రీవాలకు బహుమతి నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది మరో యుద్ధానికి దారి తీస్తుందా.. చూడాలి..!




నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

వంశీ-కరణంలతో ఇబ్బందే... డ్యామేజ్ జరుగుతుందా?

హిందూపురంలో 'ఫ్యాన్' పాలిటిక్స్: ఫస్ట్ టైం బాలయ్యకు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>