Womenyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/women_healthcare/abartionsdf5a6f6f-f5eb-4ec5-b532-6b3ceb69e325-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/women_healthcare/abartionsdf5a6f6f-f5eb-4ec5-b532-6b3ceb69e325-415x250-IndiaHerald.jpgకొన్ని నెలల్లో పసి పాప కేరింతలతో ఇల్లు కలకళలాడుతుందనుకుంటే ఉన్నట్లుండి గర్భం పోతుంది. ఆ ఇంట్లో విషాదం నింపుతుంది. కడుపులో ఉన్న పిండం కడుపులోనే చనిపోతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు... ఏటా లక్షల్లో ఇలాంటి అవాంఛనీయ అబార్షన్లు.. abartions;india;pakistan;bangladesh;kadapa;air;manadesamభారత్ లో అబార్షన్లకు అదే కారణం.. తేల్చేసిన శాస్త్రవేత్తలుభారత్ లో అబార్షన్లకు అదే కారణం.. తేల్చేసిన శాస్త్రవేత్తలుabartions;india;pakistan;bangladesh;kadapa;air;manadesamWed, 27 Jan 2021 19:17:00 GMTఇంటర్నెట్ డెస్క్: కొన్ని నెలల్లో పసి పాప కేరింతలతో ఇల్లు కలకళలాడుతుందనుకుంటే ఉన్నట్లుండి గర్భం పోతుంది. ఆ ఇంట్లో విషాదం నింపుతుంది. కడుపులో ఉన్న పిండం కడుపులోనే చనిపోతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు... ఏటా లక్షల్లో ఇలాంటి అవాంఛనీయ అబార్షన్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ అబార్షన్లు ఇక మీదట మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. దీనికి కారణం ఏంటో కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదేంటో తెలుసా..? కాలుష్యం. 



అవును.. కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోవడానికి వాయు కాలుష్యమే ప్రధాన కారణమని చైనాకు చెందిన పెకింగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా వారు చేసిన అధ్యయనంలో అవాంఛనీయ అబార్షన్లకు అసలైన కారణం బయటపడింది. గాలిలో పెరుగుతోన్న కాలుష్యమే ఇందుకు ముఖ్య కారణమని తేల్చి చెబుతున్నారు. గర్భంలో బిడ్డ భూమ్మీదికి రాకుండా దాని ఉసురు తీసి, తల్లులకు కడపుకోత మిగుల్చుతోంది వాయు కాలుష్యమేనని వారంటున్నారు.

ఈ అబార్షన్ల సమస్య ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉందట. ముఖ్యంగా ఈ సమస్య భారత్ లోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లో 29 శాతం ఉందట. ఆయా దేశాల్లో కూడా ఈ అబార్షన్లకు వాయుకాలుష్యమే కారణమని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైందట.



గత 16 ఏళ్లలో ప్రతి ఏడాది సగటున 3,49,681 అబార్షన్ల చొప్పున అధికారికంగా నమోడయ్యాయని, ఇక అనధికారికంగా కూడా మరికొన్ని జరిగి ఉండవచ్చని, వీటికి కారణం వాయు కాలుష్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతేకాదు ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందట. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశాల ప్రకారం.. కాలుష్య కారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. కానీ దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. విచిత్రం ఏమంటే మనదేశంలో అధికంగా 77 శాతం అబార్షన్లు వాయు కాలుష్యం వల్లే జరుగుతున్నాయట. ఆ తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం అబార్షన్లు ఈ గాలి కాలుష్యం వల్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






కక్ష్య సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడను : నిమ్మగడ్డ !!

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>