PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5070322f-3622-4708-95fc-5183a0ed71ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5070322f-3622-4708-95fc-5183a0ed71ec-415x250-IndiaHerald.jpgఏపీ స్థానిక ఎన్నికల విషయంలో అటు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో మరియు హై కోర్ట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో కయ్యానికి దిగి ప్రజలందరి దృష్టిలో చాలా విలువను కోల్పోయారు. న్యాయం ఎప్పుడూ ప్రజల వైపు ఉంటుందనడానికి సాక్ష్యం, మొన్ననే సుప్రీం కోర్ట్ స్థానిక ఎన్నికల రద్దు పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వానికి తమ తీర్పుతో గట్టి సమాధానమే ఇచ్చారు. jagan-nimmagadda-elections;view;jagan;andhra pradesh;local language;mantraజగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!jagan-nimmagadda-elections;view;jagan;andhra pradesh;local language;mantraWed, 27 Jan 2021 11:00:00 GMTజగన్ పై ఎన్నో అంచనాలతో ఏపీ లో అధికారాన్ని కట్టబెట్టారు అమాయక ప్రజలు. అయితే మనము అనుటుకుంటున్నట్లు ప్రజలేమీ తెలివిలేని వారు తెలియని వారు కాదు. జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి, అందరిలాగానే తనకి కూడా అవకాశం ఇచ్చారు. ముందు నుంచి రాజకీయ ప్రముఖులు ఊహించినట్లే జగన్ యొక్క పని తీరును తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.  మరో వైపు అర్ధం పర్ధం లేని పథకాలతో వేల కోట్లు ఖర్చు చేసి ప్రజలను సోమరిపోతులు లాగా తయారుచేస్తున్నారనే అపవాదులు ఉండనే ఉన్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో అటు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో మరియు హై కోర్ట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో కయ్యానికి దిగి ప్రజలందరి దృష్టిలో చాలా విలువను కోల్పోయారు. న్యాయం ఎప్పుడూ ప్రజల వైపు ఉంటుందనడానికి సాక్ష్యం, మొన్ననే సుప్రీం కోర్ట్ స్థానిక ఎన్నికల రద్దు పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వానికి తమ తీర్పుతో గట్టి సమాధానమే ఇచ్చారు. దీనితో దిక్కుతోచని స్థితిలో జగన్ స్థానిక ఎన్నికలకు సహకరిస్తామని తూతూమంత్రంగా అధికారిక ప్రకటన చేసారు. అయితే జగన్ ఏదో భారీ వ్యూహంతోనే ఎన్నికలకు వెళ్లనున్నాడని సమాచారం. కాగా ఇప్పుడు నిమ్మగడ్డ తాను అనుకున్న  విధంగానే స్థానిక ఎన్నికలను జరపడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.

అపారమైన అనుభవమున్న నిమ్మగడ్డ రమేష్ జగన్ వేసే అన్ని వ్యూహలను దాటుకుని ఇక్కడివరకు చేరుకున్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ దృష్టంతా ఎన్నికలను ఎటువంటి ఆటంకాలు లేకుండా జరపాలని చూస్తున్నారు. ఈ దిశగా అడుగులు వేశారు కూడా, ఇప్పటికే కొంతమంది అధికారులను ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించుకున్నారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలతో జగన్ మరియు మిగతా మంత్రులు సతమవుతున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ ఓ వైపు వైసీపీని స్థానిక ఎన్నికలలో గెలిపించడానికి, మరో వైపు నిమ్మగడ్డను నిలువరించాడనికి ఏమి చేయనున్నాడో తెలియడం లేదు. ప్రతి పక్షాలు మరియు సీనియర్ రాజకీయ ప్రముఖుల వ్యాఖ్యల ప్రకారం స్థానిక ఎన్నికలలో నిమ్మగడ్డ దెబ్బకు జగన్ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు. మరి ఏమి జరగనుందో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.


జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!

జగడ్డ : నాడు బాబోరికి...నేడు జగనోరికీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>