PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections019edd0f-473c-48ef-94c1-a83924484f45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections019edd0f-473c-48ef-94c1-a83924484f45-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తాజా కార్యక్రమం రేషన్ సరుకుల డోర్ డెలివరీ. రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ చేయాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకుగాను పెద్దఎత్తున వాహనాలను కూడా సమకూర్చింది. కొద్ది రోజుల క్రితం పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ భారీ ర్యాలీగా విజయవాడలో వీటిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సరే విజయవాడ అనేది గ్రామం కాదు కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమలులో లేదనే వాదనతో ప్రభుత్వం ఈ పని కానిచ్చేసింది. అయితే ఇప్పుడు jagan-nimmagadda-elections;amala akkineni;editor mohan;jagan;vijayawada;andhra pradesh;2019;september;february;reddy;master;partyజగడ్డ : జగనోరి మాస్టర్ ప్లాన్.. నిమ్మగడ్డ ఏం చేస్తారిప్పుడు ?జగడ్డ : జగనోరి మాస్టర్ ప్లాన్.. నిమ్మగడ్డ ఏం చేస్తారిప్పుడు ?jagan-nimmagadda-elections;amala akkineni;editor mohan;jagan;vijayawada;andhra pradesh;2019;september;february;reddy;master;partyWed, 27 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తాజా కార్యక్రమం రేషన్ సరుకుల డోర్ డెలివరీ. రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ చేయాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకుగాను పెద్దఎత్తున వాహనాలను కూడా సమకూర్చింది. కొద్ది రోజుల క్రితం పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ భారీ ర్యాలీగా విజయవాడలో వీటిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సరే విజయవాడ అనేది గ్రామం కాదు కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమలులో లేదనే వాదనతో ప్రభుత్వం ఈ పని కానిచ్చేసింది. అయితే ఇప్పుడు రేషన్ సరుకుల డోర్ డెలివరీ కార్యక్రమం మీద సందిగ్దత నెలకొంది. 

ఎందుకంటే ప్రభుత్వం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. అందుకు గాను ఇప్పటికే దాదాపుగా అన్ని సన్నాహాలు పూర్తి చేసింది కూడా. ఇప్పటికే రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసే వాహనాలను ఆయా జిల్లాలకు అలాగే జిల్లాల నుంచి మండల కేంద్రాలకు కూడా పంపిణీ చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ గ్రామాల్లో అమలులోకి రావడంతో ఈ అంశం మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే ఇది కొత్త పధకం కాదు అని పౌరసరఫరాల శాఖ వివరణ ఇవ్వడానికి సిద్ధమైందనే వాదన వినిపిస్తోంది.  ఎందుకంటే ఈ పథకాన్ని 2019 సెప్టెంబర్ లోనే జగన్ శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆనాటి నుండి శ్రీకాకుళం జిల్లాలో డోర్ డెలివరీ విధానం కొనసాగుతూ వస్తోంది. 

ఈ విషయాన్ని చెప్పి ఒకటో తేదీ నుంచి రేషన్ డోర్ డెలివరీ చేస్తామని చెప్పే అవకాశం కనిపిస్తోంది. అయితే నిమ్మగడ్డ అందుకు అనుమతించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రేషన్ సరుకులు ఉన్నా డోర్ డెలివరీ చేసే వాహనాల మీద పెద్ద ఎత్తున జగన్ బొమ్మలు అలాగే వైసీపీకి చెందిన రంగులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఎప్పుడో చనిపోయిన నాయకుల విగ్రహాలకి కూడా తొడుగులు వేసే ఎన్నికల సంఘాలు లైవ్ లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఫోటో అలాగే పార్టీ రంగులు ఉన్న వాహనాలతో రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ ఏంచేస్తారు అనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది అని చెప్పక తప్పదు.




బాడీ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే పస్తులుండాలా?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>