PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagadda-saireddy-pappus-are-not-boiling-in-ycp-now-3ad86d9c-cf21-4067-8d1f-238c28e2ab27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagadda-saireddy-pappus-are-not-boiling-in-ycp-now-3ad86d9c-cf21-4067-8d1f-238c28e2ab27-415x250-IndiaHerald.jpgఅయితే.. అది కొంత వ‌ర‌కు మాత్రమే ప‌రిమితం. జిల్లాలోని ప‌ట్ట‌ణాలు న‌గ‌రాల వ‌ర‌కే ఆయ‌న హవా చ‌లామ‌ణి అవుతోంది. ఎమ్మెల్యేల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌మాట కూడా వాస్త‌వ‌మే అయితే.. దీనిని అంద‌రూ యాక్సెప్ట్ చేయ‌డం లేదు. ఆయ‌న దూకుడు యాక్స‌ప్ట్ చేసిన వారిలోనూ సాయిరెడ్డికి అనుకూలంగా ఉన్న‌వారు త‌క్కువ మందే ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సాయిరెడ్డి హ‌వా ఏమీ ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. ప్రెస్‌మీట్లు, నోట్లు.. ప్ర‌క‌ట‌న‌లు.. అధికారుల‌పై ఆధిప‌త్యం వంటివాటిలో మాత్ర‌మే సాయిరెడ్డి దూకుడు క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిvijay sai reddy;visakhapatnam;mp;district;vishakapatnam;letter;ycp;reddy;josh;partyజ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!vijay sai reddy;visakhapatnam;mp;district;vishakapatnam;letter;ycp;reddy;josh;partyWed, 27 Jan 2021 20:11:09 GMTపార్టీ వైసీపీలో జోష్ పెరిగింది. అయితే.. ముఖ్యంగా పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే విజ‌య‌సాయి వైజాగ్ వైసీపీ రాకీయాల‌ను పూర్తిగా డామినేట్ చేసేస్తున్నారు. ఏ కార్య‌క్ర‌మం జ‌ర‌గాల‌న్నా.. ఎక్క‌డ అభివృద్ది ప‌నులు చేప‌ట్టాల‌న్నాసాయిరెడ్డి కీల‌కంగా ఉన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వ‌ర‌కు కూడా సాయిరెడ్డి త‌న ఆధిప‌త్యంలోనేన‌డిపిస్తున్నార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చ‌ర్చించాల్సిన ప‌నిలేదు. మ‌రి ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. జిల్లాలో ప‌రిస్థితి ఏంటి?  ఇన్నాళ్లు తానే హీరోగా ఉన్న సాయిరెడ్డి.. ఇప్పుడు ప‌ల్లెబాట ప‌డ‌తారా ? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే విశాఖ‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
 
సాయిరెడ్డి విశాఖ మొత్తాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకున్న మాట వాస్త‌వ‌మే. అయితే.. అది కొంత వ‌ర‌కు మాత్రమే ప‌రిమితం. జిల్లాలోని ప‌ట్ట‌ణాలు న‌గ‌రాల వ‌ర‌కే ఆయ‌న హవా చ‌లామ‌ణి అవుతోంది. ఎమ్మెల్యేల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌మాట కూడా వాస్త‌వ‌మే అయితే.. దీనిని అంద‌రూ యాక్సెప్ట్ చేయ‌డం లేదు. ఆయ‌న దూకుడు యాక్స‌ప్ట్ చేసిన వారిలోనూ సాయిరెడ్డికి అనుకూలంగా ఉన్న‌వారు త‌క్కువ మందే ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సాయిరెడ్డి హ‌వా ఏమీ ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. ప్రెస్‌మీట్లు, నోట్లు.. ప్ర‌క‌ట‌న‌లు.. అధికారుల‌పై ఆధిప‌త్యం వంటివాటిలో మాత్ర‌మే సాయిరెడ్డి దూకుడు క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌పై సాయిరెడ్డి ప్ర‌భావం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. గ్రామీణ స్థాయిలో సాయిరెడ్డి హవా ఎక్క‌డా లేదు. దీంతో వైసీపీకి ఓట్లు రాలాల‌న్నా.. వైసీపీ మ‌ద్ద‌తిచ్చిన వారు గెలుపుగుర్రం ఎక్కాల‌న్నా కూడా.. కేవ‌లం అయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల‌‌పైనే ఆధార‌ప‌డి ఉంది. ఇక ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. న‌గర రాజ‌కీయాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేలు పెడుతూ హ‌డావిడి చేయ‌డంతో పాటు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన సాయిరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా సాయిరెడ్డికి మైన‌స్ మార్కులు వేసేలా చేసింది.

నిజానికి సాయిరెడ్డిపై ఆగ్ర‌హంతో ఉన్న నాయ‌కులు చాలా మంది ఇదే మంచి అవ‌కాశం అని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిరెడ్డి అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. దీంతో త‌మ‌కు స్వేచ్ఛ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న నాయ‌కులు ఇప్పుడు త‌మ స‌త్తాచాటి .. సాయిరెడ్డి హవాకు బ్రేకులు వేయాల‌ని చూస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




కక్ష్య సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడను : నిమ్మగడ్డ !!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!

మనసుకు నచ్చకపోయినా ఆ పని చెయ్యాల్సిందే : ఆమని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>