PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections27b3b7aa-37af-4408-b5c4-5be9c2049058-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections27b3b7aa-37af-4408-b5c4-5be9c2049058-415x250-IndiaHerald.jpgచేతిలో అధికారం ఉంది. కానీ చేతులు కట్టేసారు. అపరిమితమైన వ్యూహాలు ఉన్నాయి. కానీ అసలు అవి ఎక్కడా పారవు. ఈ రకంగా చూసుకుంటే ఎపుడో ఒకపుడు మహా మహా పాలకులకు కూడా రాజ్యాంగం అంటే ఏంటో నిబంధనలు ఏంటో తెలియచెబుతూ చుక్కలు చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. jagan-nimmagadda-elections;view;cbn;amala akkineni;kumaar;tara;jagan;2019;chief minister;ycp;dookudu;mahaజగడ్డ : నాడు బాబోరికి...నేడు జగనోరికీ...?జగడ్డ : నాడు బాబోరికి...నేడు జగనోరికీ...?jagan-nimmagadda-elections;view;cbn;amala akkineni;kumaar;tara;jagan;2019;chief minister;ycp;dookudu;mahaWed, 27 Jan 2021 10:30:00 GMTమహా మహా పాలకులకు కూడా రాజ్యాంగం అంటే ఏంటో నిబంధనలు ఏంటో తెలియచెబుతూ చుక్కలు చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

సరిగ్గా 2019 ఎన్నికల వేళకు వెళ్తే నాడు చంద్రబాబు మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని చాలా ధీమాగా ఉండేవారు. నాడు ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలక్రిష్ణ ద్వివేదీ ఉండేవారు. ఆయన చార్జి తీసుకోగానే చాల స్ట్రిక్ట్ గా అన్ని అమలు చేస్తూ చాలా దూకుడుగా సాగిపోయారు. ఎక్కడికక్కడ చంద్రబాబుని గట్టిగానే  కట్టడి చేశారు. దాంతో ఊగిపోయిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఓ దశలో ఏకంగా ఎన్నికల సంఘం ఆఫీస్ ముందే ఆందోళన చేశారు.

ఇపుడు సీన్ చూస్తూంటే అదే రిపీట్ అవుతోంది అంటున్నారు. ఇపుడు జగన్ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా అలాగే కనిపిస్తున్నారు. ఆయన దూకుడుతో ఎన్నికల సంఘం అసలైన అధికారాలు ఇవీ అంటూ లెక్కలు చెప్పి మరీ చుక్కలు చూపిస్తున్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ఈ సమయంలో ఏమీ చేయలేదు. చేయగలిగినదీ అసలు లేదు. మొత్తానికి జగన్ సీఎం గా ఉన్నా కూడా మొత్తం వ్యవస్థలు అన్నీ కూడా ఎన్నికల సంఘం కంట్రోల్ లోకి వెళ్ళిపోయాయి.

ఈ పరిణామం వైసీపీ సర్కార్ పెద్దలకు ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అయినా సరే వారు తమాయించుకోవాల్సివస్తోంది. ఎందుకంటే ఇది రాజ్యాంగం, ఇదే రాజ్యాంగం బలం కూడా. మొత్తానికి నాడు బాబోరూ, నేడు జగనోరు ఇద్దరూ కూడా ఒకే విధమైన చేదు అనుభవాలే రుచి చూడడం మాత్రం విశేషమే. అందుకే చెబుతారు రాజ్యాంగం కంటే బలమైనది మరోటి లేదు అని, దానికి మించిన సార్వభౌమత్వం కూడా వేరేది లేదు కూడా.






జ‌గ‌డ్డ‌: లోక‌ల్ వార్‌లో ఏటికి ఎదురీదుతోన్న జ‌గ‌నోరి మంత్రులు.. వీళ్లు అవుటే...!

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరికి పిడి దిగిపోద్దిగా... అక్క‌డ ఫ్యాన్ తిప్పేవాళ్లే లేరా..!

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>