PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ ఇపుడు వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై మాత్రం అనేక అనుమానాలున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి కూడా సీరియస్ గా లేరు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఏకగ్రీవాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం పంచాయితీలకు ప్రోత్సాహకాలు ఇస్తాను అని ప్రకటనలు చేయటం వంటివి వివాదాస్పదం అవుతున్నాయి. వాస్తవానికి పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అనే ప్రకటన అనేది వివాదాస్పదంగా మారింది. పంచys jagan;kcr;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telangana;telugu;government;chief minister;local language;ycp;partyజగనోరు ప్రభుత్వాన్ని కూడా పార్టీ అనుకున్నారా...?జగనోరు ప్రభుత్వాన్ని కూడా పార్టీ అనుకున్నారా...?ys jagan;kcr;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telangana;telugu;government;chief minister;local language;ycp;partyWed, 27 Jan 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ ఇపుడు వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అనే దానిపై మాత్రం అనేక అనుమానాలున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి కూడా సీరియస్ గా లేరు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఏకగ్రీవాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం పంచాయితీలకు ప్రోత్సాహకాలు ఇస్తాను అని ప్రకటనలు చేయటం వంటివి వివాదాస్పదం అవుతున్నాయి. వాస్తవానికి పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అనే ప్రకటన అనేది వివాదాస్పదంగా మారింది.

పంచాయతీలు అన్నిటినీ సమానంగా చూడాల్సిన తరుణంలో ప్రోత్సాహకాలు ఇస్తాను ఏకగ్రీవాలు చేయండి అని ఒక పార్టీ అధినేతగా ఆయన ప్రకటించడం... అది కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు గురించి అధికారిక ప్రకటన చేయడం దానికి సంబంధించి జీవో విడుదల చేయడం వివాదాస్పదంగా మారాయి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాగే జీవో విడుదల చేసి కామెడి అయ్యారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జగన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రభుత్వంను రాజకీయ పార్టీని నడిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ చాలామంది సలహాదారులు కూడా ముఖ్యమంత్రి జగన్ కు సలహా ఇచ్చే విషయంలో ఘోరంగా వెనుకడుగు వేస్తున్నారు. ఈ విధానంపై కొంతమంది నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పంచాయితీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఉంది. అయితే ప్రజలను మభ్యపెట్టడానికి అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, దీనిపై ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఆసక్తికరంగా ఉంది. ఏకగ్రీవాలు విషయంలో కాస్త కఠినంగానే ముందుకు వెళ్లవచ్చు అని అంచనా వేస్తున్నారు.


అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా..?

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>