PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/police-pathakanni-muddadina-telugunti-kodalu-sipra-jeevanlalcc728b7b-2c75-4e07-b54c-cef3ef4031ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/police-pathakanni-muddadina-telugunti-kodalu-sipra-jeevanlalcc728b7b-2c75-4e07-b54c-cef3ef4031ab-415x250-IndiaHerald.jpgసీఐఎస్‌ఎఫ్‌.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని విభాగం ఇది.. రక్షణ దళంలో కీలకమైన బలగాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల భద్రత దీని బాధ్యత. అంతటి కీలకమైన దళంలో పని చేస్తూ శభాష్ అనిపించుకున్నారో మహిళ పోలీస్‌ అధికారి. ఆమే శ్రీమతి శిప్రా జీవన్ లాల్.. ఆమె సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ ఇన్సెపక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఆమె నిరుపమాన సేవలను కేంద్రం గుర్తించింది. సర్వోత్కృష్ట విధి నిర్వహణ కోసం భారత ప్రభుత్వం ప్రఖ్యాత భారత పోలీసు పతpolice-medal;women;jeevan;ramu;district;school;mla;husband;woman;central government;nayak;ramnath kovindపోలీస్‌ పతకాన్ని ముద్దాడిన తెలుగింటి కోడలు శిప్రా జీవన్‌లాల్‌పోలీస్‌ పతకాన్ని ముద్దాడిన తెలుగింటి కోడలు శిప్రా జీవన్‌లాల్‌police-medal;women;jeevan;ramu;district;school;mla;husband;woman;central government;nayak;ramnath kovindWed, 27 Jan 2021 08:36:00 GMTకేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని విభాగం ఇది.. రక్షణ దళంలో కీలకమైన బలగాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. పరిశ్రమలు, ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల భద్రత దీని బాధ్యత. అంతటి కీలకమైన దళంలో పని చేస్తూ శభాష్ అనిపించుకున్నారో మహిళ పోలీస్‌ అధికారి. ఆమే శ్రీమతి శిప్రా జీవన్ లాల్.. ఆమె సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్‌ ఇన్సెపక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఆమె నిరుపమాన సేవలను కేంద్రం గుర్తించింది. సర్వోత్కృష్ట విధి నిర్వహణ కోసం భారత ప్రభుత్వం  ప్రఖ్యాత భారత పోలీసు పతకాన్ని ప్రకటించింది.

72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా శ్రీమతి శిప్రా జీవన్‌లాల్‌ ఈ పతకం అందుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. శిప్రా జీవన్‌లాల్‌ మన తెలుగింటి ఆడపడుచు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే శ్రీ రాములు నాయక్ కోడలు ఆమె. ఎమ్మెల్యే శ్రీ రాములు నాయక్ కుమారుడు జీవన్‌ లాల్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. ఆయన ముంబైలో ఆదాయపన్ను శాఖలో పని చేస్తున్నారు. ఇన్‌ కంటాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్నారు.

విధినిర్వహణ అంటే ప్రాణంగా భావించే జీవన్‌లాల్‌ దంపతులు.. తమ తమ శాఖల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. భారత పోలీస్‌ మెడల్ అందుకోవడంపై శ్రీమతి శిప్రా జీవన్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందని శిప్రా జీవన్‌లాల్‌ తెలిపారు. ఇక ఆమె భర్త జీవన్‌లాల్‌ ఖమ్మం జిల్లాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు గురుకుల పాఠశాలలో చదివిన జీవన్‌లాల్.. ఇప్పటికీ ఆ పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

తెలుగింటి కోడలికి భారత పోలీస్‌ మెడల్ రావడంపై ఖమ్మం జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ కోడలు  భారత పోలీస్‌ మెడల్ అందుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ రాములు నాయక్ తెలిపారు. శ్రీమతి శిప్రా జీవన్‌లాల్ విధినిర్వహణలో మరెంతగానో పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.. 


జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

వంశీ-కరణంలతో ఇబ్బందే... డ్యామేజ్ జరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>