MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-and-ariyana8e85612b-77c5-4230-966d-8a3ad8cec86e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-and-ariyana8e85612b-77c5-4230-966d-8a3ad8cec86e-415x250-IndiaHerald.jpgరీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ అరియానా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. సీజన్ 4లోకి అరియానా ఎంటరైనప్పుడు ఈ అమ్మడిపై ఆడియెన్స్ కు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ, రాను రాను ఈ అమ్మడి ఆటతీరు చూసి జనాలు ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ గా మారిపోయారు. రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేశాక అరియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మరింత స్టార్ డంను పెంచుకుంది. avinash and ariyana;watch;kumaar;lasya;ram pothineni;devineni avinash;bigboss;january;2020;gift;houseఅవినాష్ పై మరోసారి ప్రేమను చాటుకున్న అరియానాఅవినాష్ పై మరోసారి ప్రేమను చాటుకున్న అరియానాavinash and ariyana;watch;kumaar;lasya;ram pothineni;devineni avinash;bigboss;january;2020;gift;houseWed, 27 Jan 2021 10:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ అరియానా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. సీజన్ 4లోకి అరియానా  ఎంటరైనప్పుడు ఈ అమ్మడిపై ఆడియెన్స్ కు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ, రాను రాను ఈ అమ్మడి ఆటతీరు చూసి జనాలు ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్ గా మారిపోయారు. రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేశాక అరియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మరింత స్టార్ డంను పెంచుకుంది.

బిగ్ బాస్ షో ముగిసి దాదాపు నెలరోజులు కావస్తోంది. అయినా కంటెస్టెంట్స్ సందడి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ కంటెస్టెంట్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. హౌస్ లో ఒకరినొకరు నామినేట్ చేసుకుని ఫైరైన కంటెస్టెంట్స్ బయట ఎంతో ఫ్రెండ్లీగా మూవవడం ముచ్చటగా ఉందంటున్నారు ఆడియెన్స్.

ఇదిలా ఉంటే జనవరి 25న అరియానా తన సన్నిహితులకు పుట్టినరోజు పార్టీనిచ్చింది. ఈ పార్టీకి మోనాల్, సోహెల్, మెహబూబ్, లాస్య అలాగే కుమార్ సాయి పాల్గొన్నారు. అరియానాకు ఎంతో స్పెషలైన అవినాష్ మాత్రం ఈ పార్టీకి అటెండ్ అవలేకపోయాడు. అవినాష్ ను ఇన్వైట్ చేశానని కానీ బిజీ షెడ్యూల్ వలన అవినాష్ రాలేకపోయాడని అరియానా క్లారిటీనిచ్చింది.

లంచ్ పార్టీకి హాజరుకాలేకపోయినా అవినాష్ తనదైన స్టయిల్లో అరియనా బర్త్ డేను స్పెషల్ గా ప్లాన్ చేశాడు. స్పెషల్ గిఫ్ట్స్ తో ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అరియానా తనపై అవినాష్ కురిపించే ప్రేమకు కరిగిపోయింది. ఎమోషనలైపోయింది. 2020 తనకు జరిగిన మంచి విషయం అవినాష్ ఫ్రెండ్షిప్ అంటూ సందర్భం దొరికినప్పుడల్లా చెప్పుకొస్తోంది.

మరోవైపు సోహెల్ అలాగే మెహబూబ్ అరియానాకు వాచెస్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. అరియానాకు వాచెస్ అంటే చాలా ఇష్టమని ఆమె వద్ద వాచెస్ కలక్షన్ ఉందని ఆమె టేస్ట్ డిఫెరెంట్ గా ఉండడంతో ఆమెనే స్వయంగా వాచ్ షాప్ కి తీసుకెళ్లి వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చానని మెహబూబ్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ ఇచ్చిన వాచెస్ అరియానాకు బాగా నచ్చాయి. 


రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>