PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nunammukunnollu-addamga-book-avutunnaruga7a8358a9-00b6-49f7-84f1-35465abfdbce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nunammukunnollu-addamga-book-avutunnaruga7a8358a9-00b6-49f7-84f1-35465abfdbce-415x250-IndiaHerald.jpgఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. అటు ప్రభుత్వం కూడా ఆయన ఆదేశాలు పాటిస్తోంది. ఇప్పుడు ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు చకచకా అమలవుతున్నాయి. తాజాగా ఆయన ఆదేశాల ప్రకారం చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి సరెండ్‌ చేసింది. అలాగే ఆయన గతంలో బదిలీ చేసిన డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల బదిలీలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో పవర్‌ పూర్తిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చేతికి వచ్చేసింది. అధికారం నిమ్మగడ్డ చేతికి రావడంతో ఇన్నాళ్లూ సీఎం జగన్‌ను నమ్ముకjagan-nimmagadda-elections;kumaar;jagan;collector;chief commissioner of elections;shaktiజగడ్డ: జగన్‌ను నమ్ముకున్నోళ్లు అడ్డంగా బుక్కవుతున్నారుగా..?జగడ్డ: జగన్‌ను నమ్ముకున్నోళ్లు అడ్డంగా బుక్కవుతున్నారుగా..?jagan-nimmagadda-elections;kumaar;jagan;collector;chief commissioner of elections;shaktiWed, 27 Jan 2021 09:14:33 GMTఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. అటు ప్రభుత్వం కూడా ఆయన ఆదేశాలు పాటిస్తోంది. ఇప్పుడు ఏపీలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు చకచకా అమలవుతున్నాయి. తాజాగా ఆయన ఆదేశాల ప్రకారం చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి సరెండ్‌ చేసింది. అలాగే ఆయన గతంలో బదిలీ చేసిన డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల బదిలీలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో పవర్‌ పూర్తిగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ చేతికి వచ్చేసింది.

అధికారం నిమ్మగడ్డ చేతికి రావడంతో ఇన్నాళ్లూ సీఎం జగన్‌ను నమ్ముకుని గుడ్డిగా వ్యవహరించిన అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సీఎం అండ చూసుకునే నిన్న మొన్నటి వరకూ అధికార యంత్రాంగం అంతా నిమ్మగడ్డను పూచిక పుల్లలా తీసి పారేశారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే.. ఒక్కరంటే ఒక్క కలెక్టర్ కూడా హాజరు కాలేదు.. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే.. ఒక్క చోట కూడా నామినేషన్‌ తీసుకోలేదు.. ఒక్క గుంటూరు జిల్లాలోనే కలెక్టర్ నామినేషన్లు తీసుకునే ఏర్పాట్లు చేశారు.

గతంలో జగన్ నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తాడని పేరు సంపాదించుకున్నారు. ఆయన్ను నమ్ముకుని జైలు పాలైన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని ఆయన పట్టుబట్టి ఏపీకి రప్పించుకున్నారు. త్వరలో ఆమెకు సీఎస్‌గానూ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఆదిత్యనాథ్ దాస్ విషయమూ అంతే.. కానీ.. ఇప్పుడు సీన్ మారింది. ఏపీలో పవర్ సెంటర్ మారడంతో..  జగన్‌ను నమ్ముకున్నారు అందరూ దెబ్బలు తింటున్నారు.


రాజకీయ అధికారానికి.. రాజ్యాంగ శక్తి అధికారానికి ఉన్న తేడా ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. జగన్‌ను నమ్ముకుని నిమ్మగడ్డను ధిక్కరించిన అధికారుల కేరీర్‌లోనే ఇప్పుడు బ్లాక్ మార్కు పడింది. దీంతో అధికార యంత్రాంగం ఇప్పుడు నిమ్మగడ్డ పేరు చెబితే భయంతో వణుకుతోంది. ఇక ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.  మొత్తానికి ఏపీలో రాజకీయం భలే రంజుగా మారుతోంది. 


త‌మిళ రాజ‌కీయ తెర‌పైకి చిన్న‌మ్మ పున‌రాగ‌మ‌నం...

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?

ఆ వైసీపీ ఎమ్మెల్యే దోపిడీలు, భూక‌బ్జాల‌కు అంతేలేదా ?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>