PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-new-salary-fitment03dd4120-1d77-4a34-836a-c4b08a64f1eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-new-salary-fitment03dd4120-1d77-4a34-836a-c4b08a64f1eb-415x250-IndiaHerald.jpg *ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్ళకు పెంచడం *ఉద్యోగుల క‌నీస వేత‌నం ₹19000/- గ‌రిష్ట వేత‌నం ₹162070 వ‌ర‌కు ఉండవచ్చన్న సూచనలు చేసింది. *గ్రాట్యుటీ ప‌రిమితి ₹16 ల‌క్షల‌ు *శిశు సంర‌క్ష‌ణ సెలవులు 90 నుంచి 120 రోజుల‌కు పెంచాలని సూచన చేసింది. అయితే ఈ సిఫార్సులే అంతిమం అనుకోరాదు. ఉద్యోగ సంఘాలతో సిఫార్సులపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని “త్రిసభ్య కమిటీ” ని చర్చించమని కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ కమిటీనే ఇంత తక్కువ సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగులు, 30 శాతం 40 శాతం అడిగే అవకాశం ఉండదు. telangana new salary fitment;view;kcr;andhra pradesh;telangana;letterవేతన సవరణ షాక్ : తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తివేతన సవరణ షాక్ : తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిtelangana new salary fitment;view;kcr;andhra pradesh;telangana;letterWed, 27 Jan 2021 16:34:51 GMTతెలంగాణ ఏర్పడిన తొలిరోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఫిట్-మెంట్ ప్రకటించింది. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులందరూ ఉద్యమించడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో వారి పాత్ర కీలకం కావడంతో కేసీఆర్, నాడు సిఫార్సులకు మించి ఏకంగా 43 శాతం ఫిట్‌-మెంట్ ప్రకటించారు.  ఉద్యోగ సంఘాలన్నీ చాలా సంతోషపడ్డాయి.

తెలంగాణ ప్రకటనతో ఏపిలో ఆర్థిక సమస్యలున్నా, తమ ఉద్యోగుల్ని నిరాశ పరచడం ఇష్టం లేక, అదే ఫిట్‌మెంట్ ను వారు ప్రకటించారు.
ఇప్పుడు మరోసారి “పీఆర్సీ కమిషన్” తన నివేదిక ఇచ్చింది. ఎప్పుడో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందే రావాల్సింది. కానీ వ్యూహాత్మకంగా  రెండు సంవత్సరాల పాటు నిరీక్షింపజేసి తీరికగా నివేదిక ఇచ్చారు.

ప్రభుత్వం దాన్ని ఇప్పుడు బహిర్గతం చేసింది. ఆ నివేదికలో ఫిట్‌-మెంట్‌ను కేవలం 7.5 శాతానికి మాత్రమే రెకమండ్ చేశారు. అయితే నివేదిక లోని కొన్ని సూచనలు ఉద్యోగులకు కూడా సంతృప్తిని కలిగించేలా ఉన్నాయి.

*ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్ళకు  పెంచడం *ఉద్యోగుల క‌నీస వేత‌నం ₹19000/-  గ‌రిష్ట వేత‌నం ₹162070 వ‌ర‌కు ఉండవచ్చన్న సూచనలు చేసింది.
*గ్రాట్యుటీ ప‌రిమితి ₹16 ల‌క్షల‌ు
*శిశు సంర‌క్ష‌ణ సెలవులు 90 నుంచి 120 రోజుల‌కు పెంచాలని సూచన చేసింది.

అయితే ఈ సిఫార్సులే అంతిమం అనుకోరాదు. ఉద్యోగ సంఘాలతో సిఫార్సులపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని “త్రిసభ్య కమిటీ” ని చర్చించమని కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ కమిటీనే ఇంత తక్కువ సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగులు, 30 శాతం 40 శాతం అడిగే అవకాశం ఉండదు. అంత ఎక్కువ ఫిట్-మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది.

అయితే మద్యంతర భృతి (ఐఆర్) కూడా ఇవ్వకుండా, ఎకాయకీ పిఆర్సి 7.50 శాతానికి పరిమితం చేశారు. దాంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్యంతర భృతి 27 శాతం ప్రకటించింది. అంతే కాదు అదే తక్కువలో తక్కువ "వేతన సవరణ" గా మార్చే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ ఉద్యోగులు ఏం చేస్తారో అని వేచి చూడాలి!
 
 





ఇక రాబోయే ఈ తెలుగు సినిమాలలో హీరోల పాత్రలు ఒక రేంజిలో వుంటాయట....

మరో సారి బాక్సాఫీస్ లో షేక్ చేయడానికి సిద్దమైన ‘జైలవకుశ’.. వామ్మో టికెట్లేంటి ఇలా అమ్ముడుపోతున్నాయి..

'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!

పవన్ కల్యాణ్ కు చిరు మద్దతు.. మళ్లీ ఒక్కటి కానున్నారా?

హన్సిక సినిమాల్లోకి రావడానికి ఆ పని చేసిందా.? నాలుగేళ్లలో ఇంత మార్పుకు కారణం అదేనా..?

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>