MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spbfaafac27-d8f0-4206-8d4b-706970ce8e87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/spbfaafac27-d8f0-4206-8d4b-706970ce8e87-415x250-IndiaHerald.jpgగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార‌తీయ గాయకుడు. ఆయన గానానికి ఎల్లలు లేవు. ఆయన పాటకు పరుగులే తప్ప అడ్డూ అదుపూ లేవు. వేలాది పాటలను పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలు ప్రతిభను తూకం వేయడానికి ఏ అక్షరాలు సరిపోవు. బాలు గురించి ఒక మాట ఉంది. ప్రపంచంలోని పది మంది జీనియస్ లలో ఆయన ఒకరు అని. spb;jeevitha rajaseskhar;andhra pradesh;telugu;rayalaseema;tamil;lie;padma shri;paruguమొత్తానికి తమిళ బాలుడే..?మొత్తానికి తమిళ బాలుడే..?spb;jeevitha rajaseskhar;andhra pradesh;telugu;rayalaseema;tamil;lie;padma shri;paruguTue, 26 Jan 2021 11:00:00 GMT
అటువంటి బాలు దివంగతులై ఇప్పటికి సరిగ్గా నాలుగు నెలలు అయింది. బాలూ కరోనా కాటుకు బలి అయిన సంగతి తెలిసిందే. బాలుకు జీవించి ఉండగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఆయన గాన‌ కౌశలానికి మెచ్చి ప్రభుత్వాలు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చాయి. ఇపుడు బాలూకు దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఇక మిగిలింది భారత రత్న మాత్రమే అన్న మాట.

ఇదిలా ఉంటే బాలూకి ఈ అవార్డు కూడా తమిళ నాడు కోటాలో లభించడం విశేషం. అంతకు ముందు కూడా బాలూకు పద్మ అవార్డులు అన్నీ తమిళ కోటాలోనే లభించాయి. బాలూ అచ్చమైన తెలుగువాడు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వాడు. మరి బాలూ గురించి తెలుగు వారి కంటే తమిళులే ఎక్కువగా కన్నీరు కార్చారు. మా బాలూ అంటూ అక్కున చేర్చుకున్నారు. ఆయన ఆసుపత్రిలో మరణ శయ్య మీద ఉంటే వారే పరామర్శించారు.

ఇక బాలూ అంత్య క్రియలకు కూడా వెళ్ళిన వారూ వారే. బాలూ కూడా అక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకుని తన జీవిత పర్యంతం తమిళుల ప్రేమను చూరగొన్నారు. ఇపుడు మరణాంతరం కూడా అత్యున్నత పురస్కారం తమిళ కోటాలోనే ఆయనకు దక్కింది. ఏపీ సర్కార్ బాలూకు భారత రత్న ఇవ్వాలని కోరినా ఎందుకో అది నేరవేరలేదు. మొత్తం మీద చూసుకుంటే బాలూ అన్ని భాషాలను ప్రేమిస్తారు. కానీ బాలూని మనస్పూర్తిగా  ప్రేమించి అక్కున చేర్చుకున్న తమిళ సీమ మా బాలూ అని ఇపుడు పూర్తిగా దత్తత తీసేసుకుందనే చెప్పాలి. ఇది తెలుగు వారికి గర్వామా. అవమానమా అన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి.




హీరోగా కలిసిరాని కామెడీ హీరో ! ఎవరో తెలుసా?

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>