EditorialSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ap-state-brahmins-request-to-cm-for-their-welfare-and-protection-363adaee-7805-499e-93c8-1f926d00731f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/ap-state-brahmins-request-to-cm-for-their-welfare-and-protection-363adaee-7805-499e-93c8-1f926d00731f-415x250-IndiaHerald.jpgబ్రాహ్మణులకు పేరుకే కార్పొరేషన్ పేరిట నిధులు ప్రకటింఛారు కానీ నిధులను మాత్రం సక్రమంగా విడుదల చేయటంగానీ. వినియోగించటంకానీ లేదు. ఇక సంక్షేమం విషయాలను పక్కన పెట్టి బ్రాహ్మణుల రక్షణ విషయానికి వస్తే... గత కొన్నిరోజులుగా హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా, అతి కిరాతకంగా దాడులు చేస్తుండటం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే...ఈ క్రమంలో బ్రాహ్మణుడు తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తుండటం విచారకరంbrahmana ghosha;amala akkineni;santoshi;satya;vidya;jagan;andhra pradesh;telangana;indiaherald group;2019;marriage;2020;aqua;ycp;coronavirusబ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?brahmana ghosha;amala akkineni;santoshi;satya;vidya;jagan;andhra pradesh;telangana;indiaherald group;2019;marriage;2020;aqua;ycp;coronavirusTue, 26 Jan 2021 15:05:00 GMT2020, మార్చ్ నెల నుండి బ్రాహ్మణుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వివిధ శుభకార్యాలు జరిపించటం ద్వారా భుక్తిని సంపాదించే బ్రాహ్మణునికి కరోనా వైరస్ రూపంలో పెద్ద ప్రమాదం ఏర్పడింది. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి శుభకార్యాలు కూడా పెద్దగా జరగకపోవటంతో బ్రాహ్మణుల జీవనం స్తంభించిపోయింది. ఇక పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో వివిధ పధకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అక్కడ బ్రాహ్మణ యువకులను వివాహం చేసుకునే స్త్రీలకు సుమారుగా 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పేద పురోహితుల‌కు పెళ్లి ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే ఇస్తోంది. ఇక త‌మిళ‌నాడు రాష్ట్రంలో అయితే.. బ్రాహ్మణుల చ‌దువు నుంచి వేద విద్య, వివాహం వ‌ర‌కూ కూడా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు చేస్తున్నాయి.



ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే... దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘బ్రాహ్మణ కార్పొరేషన్’ గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏటా రూ.25 కోట్ల నిధులను కేటాయించేవారు. వాటిని వివిధ స్థాయిల్లో బ్రాహ్మణుల అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేవారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఎన్నో రకాల పూజలు, యాగాలు నిర్వహించారు బ్రాహ్మణులు, మరీ ముఖ్యంగా శారదా పీఠం అధిపతి అయినటువంటి స్వరూపానందేంద్ర స్వామి వారు ఏకంగా జగన్ అధికారంలోకి రావాలని ఎంతగానో అభిలషించటం, కన్న కొడుకులా జగన్ పై ఆప్యాయతను కనబరచటం అందరికీ తెలిసిందే. ఇక జరిగిన ఆ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్ వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను ఒక్కసారిగా పెంచటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులంతా ఎంతో సంతోషించారు. కానీ బ్రాహ్మణుల సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే... పేరుకే కార్పొరేషన్ పేరిట నిధులు ప్రకటింఛారు కానీ నిధులను మాత్రం సరైన విధంగా, సక్రమంగా విడుదల చేయటంగానీ. వినియోగించటంకానీ లేదు. తద్వారా రాష్ట్రంలో వేద‌విద్య‌కు ప్రాధాన్యం, ప్రోత్సాహం నానాటికీ త‌గ్గిపోతోంది. ఉపనయనాలు మొదలుకొని బ్రాహ్మణుల వివాహం ఇతరత్రా కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుండి తగిన సహాయం, ప్రోత్సాహం లేకపోవటంతో కుంటుపడ్డాయి. ఇక అలాగే రాష్ట్రంలో బ్రాహ్మణులకు ప్రతినెలా అందజేస్తున్న 5 వేల భ్రుతి కేవలం కంటి తుడుపు చర్యగానే మిగిలింది.  ఇక సంక్షేమం విషయాలను పక్కన పెట్టి బ్రాహ్మణుల రక్షణ విషయానికి వస్తే... ఇటీవలే గత కొన్నిరోజులుగా హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా, అతి కిరాతకంగా దాడులు చేస్తుండటం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే...ఈ క్రమంలో బ్రాహ్మణుడు తన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని భయం భయంగా జీవించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర జగన్ సర్కార్ బ్రాహ్మణుల కష్టాన్ని, వారి ఘోషను అర్ధం చేసుకొని వారికి అన్ని విషయాల్లో తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని అలాగే వారి సంక్షేమానికీ, రక్షణకూ పెద్దపీట వేయాలనేదే బ్రాహ్మణుల మొర.
 


ఇప్పుడు రెడీ అంటున్నారు అప్పుడేమైంది ..జగనోరు !!

అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>