Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/young-man-drowns-to-death-in-lake-while-trying-to-rescue-goat-in-sangareddy-district1ff9de3c-cfee-473d-9367-e8949ce4b34b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/young-man-drowns-to-death-in-lake-while-trying-to-rescue-goat-in-sangareddy-district1ff9de3c-cfee-473d-9367-e8949ce4b34b-415x250-IndiaHerald.jpgనీట మునిగిన మూగ జీవి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులో జరిగింది. చెరువులో పడ్డ తన మేకపిల్లను కాపాడేందుకు తనకు ఈత రాదన్న విషయాన్ని పక్కన పెట్టి ఆ యువకుడు చెరువులో దూకాడు. కానీ అతనికి ఈత రాకపోవడంతో చెరువులోని గుంతలో మునిగిపోయి శవంగా తేలాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ టైలర్ కాలనీ వాసి షేక్ అసద్(18). ఈ యువకుడు ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నారు. అయితే షేక్ అసద్ కుటుంబం ఓ మేకపిల్లను కూడా పెంచుకుంటున్నారు.crime;hyderabad;police;pond;accident;local language;father;paruguపాపం.. మేకపిల్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు..పాపం.. మేకపిల్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు..crime;hyderabad;police;pond;accident;local language;father;paruguTue, 26 Jan 2021 16:55:59 GMTహైదరాబాద్ శివారులో జరిగింది. చెరువులో పడ్డ తన మేకపిల్లను కాపాడేందుకు తనకు ఈత రాదన్న విషయాన్ని పక్కన పెట్టి ఆ యువకుడు చెరువులో దూకాడు. కానీ అతనికి ఈత రాకపోవడంతో చెరువులోని గుంతలో మునిగిపోయి శవంగా తేలాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ టైలర్ కాలనీ వాసి షేక్ అసద్(18). ఈ యువకుడు ప్రస్తుతం ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నారు. అయితే షేక్ అసద్ కుటుంబం ఓ మేకపిల్లను కూడా పెంచుకుంటున్నారు.
కాగా ఆ మేక ఈ మధ్యనే అనారోగ్యం పాలయ్యింది. దాంతో ఆ మేకపిల్లను తీసుకుని షేక్ అసద్, అతని సోదరుడు దానిని కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ హాస్పటల్ తు తీసుకెళ్లి వైద్యం చేయించారు. తదుపరి వారు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో వారి మేకవెంట వీధి కుక్కలు పడ్డాయి. దాంతో ఆ మేక పరుగులు తీసి సమీపంలో ఉండే చెరువులో దూకేసింది. దాన్ని రక్షించేందుకు అసద్ కూడా చెరువులో దూకేసాడు. అతనికి ఈత రాదనే విషయం మరిచిపోయి అసద్ దూకడం వల్ల లోతు ఎక్కువగా ఉండటంతో అసద్ చెరువులో మునిగిపోయాడు.

కాగా అసద్ ను కాపాడేందుకు అతని సోదరుడు నానా విధాల ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. కాగా ఈ ఘటనలో చెరువులో దూకిన మేకపిల్ల ప్రాణాలతో బయటపడ్డా.. అసద్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికి తీసారు. తదుపరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అసద్ తండ్రి కూడా 20 రోజుల కిందటే రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు అసద్ కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

త్రివిక్రమ్ సినిమాల్లో ఇవి రిపీట్.. ఎప్పుడైనా గుర్తించారా ?

'RRR' స్టోరీ లీక్..అల్లూరి కన్నా కొమురం భీమ్ కథే హైలైట్..!!

అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>