Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉధ్వేగానికి గురయ్యారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం శ్రీకాకుళం నగర పరిధిలోని ప్రభుత్వ ఆర్ట్స్ బాలుర కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పీఎన్ కాలనీ న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులు ప్రదర్శించిన కోవిడ్ సాంగ్ అందరి మనసుల్ని కదిలించింది. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ యంత్రాంగం ధైర్యంగాj nivaas;india;andhra pradesh;mp;district;government;police;school;collector;mlaకంటతడి పెట్టుకున్న శ్రీకాకుళం కలెక్టర్ .... ఎందుకంటే..!కంటతడి పెట్టుకున్న శ్రీకాకుళం కలెక్టర్ .... ఎందుకంటే..!j nivaas;india;andhra pradesh;mp;district;government;police;school;collector;mlaTue, 26 Jan 2021 22:16:15 GMT
కంటతడి పెట్టుకున్న శ్రీకాకుళం కలెక్టర్ .... ఎందుకంటే..!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన దేశం లో ఉన్నటువంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముక్యమంత్రి తో పాటు ఆయా జిల్లాలోని ఎమ్మెల్యే లు మరియు ఎంపీ లు మరియు ఆయా గవర్నమెంట్ అధికారులు అయినటువంటి ఐఏఎస్ మరియు ఐపీఎస్ వారు కూడా ఈ రోజు ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.

అందులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఉధ్వేగానికి గురయ్యారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం శ్రీకాకుళం నగర పరిధిలోని ప్రభుత్వ ఆర్ట్స్ బాలుర కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పీఎన్ కాలనీ న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులు ప్రదర్శించిన కోవిడ్ సాంగ్ అందరి మనసుల్ని కదిలించింది. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ యంత్రాంగం ధైర్యంగా విధులను నిర్వర్తించిన తీరును అద్భుతంగా విద్యార్ధులు దృశ్యరూపంలో చూపించారు.

పారిశుధ్యకార్మికులు , హెల్త్ వర్కర్లు , పోలీసులు , వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది , వైద్యులు కరోనా బారిన పడుతూనే వైరస్ కు అడ్డు కట్ట వేసేందుకు విధుల్లో పాల్గొని కరోనా వారియర్స్ గా నిలిచిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దీంతో గడచిన 10 నెలల కాలంలో కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారు గుర్తుకు రావడంతో కలెక్టర్ నివాస్ కంటతడిపెట్టుకున్నారు. కలెక్టరే కాదు...ఈ దృశ్యరూపాన్ని తిలకించిన ప్రతీ ఒక్కరూ ఉధ్వేగానికి గురయ్యారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



ఆకుకూరల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా...!

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>