PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-university14328fc9-05fb-4c1d-948c-acd736640109-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nagarjuna-university14328fc9-05fb-4c1d-948c-acd736640109-415x250-IndiaHerald.jpgగణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాగార్జున యూనివర్సిటీ అధికారులు ఓవరాక్షన్ చేశారు. రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్న పాటలను యూనివర్సిటీ అధికారులు ప్లే చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులతో డ్యాన్సులు చేయించారు. వేడుకలలో కొందరు రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. nagarjuna university;nagarjuna akkineni;dr rajasekhar;jagan;nagarjuna university;university;dance;tdp;ycpరిపబ్లిక్ డే వేడుకల్లో జగన్ సాంగ్స్రిపబ్లిక్ డే వేడుకల్లో జగన్ సాంగ్స్nagarjuna university;nagarjuna akkineni;dr rajasekhar;jagan;nagarjuna university;university;dance;tdp;ycpTue, 26 Jan 2021 21:31:56 GMTయూనివర్సిటీ అధికారులు ఓవరాక్షన్ చేశారు. రిపబ్లిక్ డే సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్న పాటలను యూనివర్సిటీ అధికారులు ప్లే చేశారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులతో డ్యాన్సులు చేయించారు. వేడుకలలో కొందరు రికార్డింగ్  డ్యాన్సులు చేశారు. సీఎం జగన్‌రెడ్డి పాటలకు కొందరు డ్యాన్సులు చేశారు. జాతీయ జెండాతో ఉన్న భరతమాత పక్కన వైసీపీ పాటలకు డ్యాన్సులు చేశారు. ఇదంతా ఇన్‌చార్జ్ వీసీ రాజశేఖర్ సమక్షంలోనే జరిగింది.

        నాగార్జున యూనివర్శిటిలో జరిగిన ఈ తతంగదానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతోంది. ఇదంతా వైస్ ఛాన్స్ లర్ సమక్షంలో జరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది.వేడుకలకు హాజరైన అతిథులు అక్కడ జరిగిన రికార్డింగ్ డ్యాన్సులతో అవాక్కయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారుల తీరు చూసి కార్యక్రమానికి హాజరైన అతిథులు, సీనియర్ సిటిజన్లు అవాక్కయ్యారు. దీంతో దేశ భక్తిగీతాలు ప్లే చేయాల్సిన చోట సీఎం జగన్‌ను స్తుతించే పాటలను ప్లే చేయడం ఏంటని  ప్రజలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.వర్సిటీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

           ఆచార్య నాగార్జున వర్సిటీలో గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమాలతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నాగార్జున యూనివర్శిటీ అధికారులు జగన్ నామస్మరణలో మునిగిపోయారని మండిపడుతున్నారు. అయినా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అది కూడా జగన్ ను పొగుడుతూ పాటలు వేసి.. విద్యార్థులతో డ్యాన్సులు చేయించడం దారుణమంటున్నారు విపక్ష నేతలు.
కొద్ది కాలంగా నాగార్జున యూనివర్శిటీ పాలన గాడి తప్పిందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత వీసీ.. వైసీపీ కార్యకర్తలా పని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జగన్ పుట్టినరోజున కూడా యూనివర్శిటీ క్యాంపస్ లో ఇలాంటే కార్యక్రమాలు జరిగాయంటున్నారు.








వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.. రిలీజ్ డేట్ పై ఈ రేంజ్ రియాక్షన్ ఏంటో..!

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>