MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7d902243-7f88-4691-803e-c90bc0be5755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7d902243-7f88-4691-803e-c90bc0be5755-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ వున్న "ఆచార్య" 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఇటీవలే సినిమా షూటింగ్ లో రాంచరణ్ కూడా అడుగు పెట్టారు. దీంతో షూటింగ్ మరింత వేగంగా పరుగులు పెడుతోంది.ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో లో ఉన్నా యి. మలయాళం బ్లాక్ బాస్టర్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యొక్క కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. అయితే సినిమా దర్శకుడు మtollywood gossips;chiranjeevi;venkatesh;editor mohan;meher ramesh;raja;kudumu;ram madhav;tollywood;cinema;telugu;huzur nagar;tamil;love;remake;director;comedy;yuva;research and analysis wing;nijam;venky kudumula;love story;paruguలవ్ స్టోరీ లో మెగాస్టార్.. క్రేజీ కాంబో..??లవ్ స్టోరీ లో మెగాస్టార్.. క్రేజీ కాంబో..??tollywood gossips;chiranjeevi;venkatesh;editor mohan;meher ramesh;raja;kudumu;ram madhav;tollywood;cinema;telugu;huzur nagar;tamil;love;remake;director;comedy;yuva;research and analysis wing;nijam;venky kudumula;love story;paruguTue, 26 Jan 2021 06:00:00 GMTటాలీవుడ్ మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సెట్స్ వున్న "ఆచార్య" 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఇటీవలే సినిమా షూటింగ్ లో రాంచరణ్ కూడా అడుగు పెట్టారు. దీంతో షూటింగ్ మరింత వేగంగా పరుగులు పెడుతోంది.ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో లో ఉన్నా యి. మలయాళం బ్లాక్ బాస్టర్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యొక్క కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. అయితే సినిమా దర్శకుడు మాట్లాడుతూ లూసిఫర్ సినిమాలోని మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేస్తున్నట్టు తెలిపాడు.

సినిమా తర్వాత తమిళ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన వేదాళం రీమేక్ లో కూడా నటించనున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా మరొక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. చలో, భీష్మ వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టొరీ లైన్ రెడీ చేసి మెగాస్టార్ కు వినిపించాడట. దీంతో కాన్సెప్ట్ నచ్చిన చిరంజీవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడని వినికిడి. దాంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట వెంకీ. లవ్ స్టోరీస్ లో కాస్త కామెడీ టచ్ ఇచ్చి ఆకట్టుకుంటాడు వెంకీ కుడుముల. మరి మెగాస్టార్ కు కూడా లవ్ స్టోరీ కాన్సెప్ట్ వినిపించాడా.. లేక ఏదైనా కొత్త కాన్సెప్ట్ తో అప్రోచ్ అయ్యాడా.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 ఒకవేళ లవ్ స్టోరీ కాన్సెప్ట్ బేస్ సినిమా అయితే నిజంగా మెగాస్టార్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ కెరియర్లో లవ్ స్టోరీ మూవీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లో లవ్ స్టోరీ అనగానే ఆల్ టైం క్లాసిక్ మూవీ "ఆరాధన" గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో మెగాస్టార్ చూపించిన నటనా వైవిధ్యం అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత అంత బలమైన లవ్ స్టోరీ సినిమా మెగాస్టార్ కు పడలేదని చెప్పాలి. ఒకవేళ  వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు సినిమా కన్ఫామ్ అయితే లవ్ స్టోరీ కోరుకుంటున్నారు మెగా అభిమానులు. మరి  ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు.


మన చేతి గోర్లు తీరును బట్టి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలాంటే..!?

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>