PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yedyurappac0696461-8fa0-4933-8496-55d5aec12bd7-415x250-IndiaHerald.jpgదాదాపు ఏడాదిన్నర కిందట పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత పార్టీ నేతల నుంచే ప్రస్తుతం తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కాగా ఐదు రోజులు కిందట కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించి, ఏడుగురికి కొత్తగా చోటుకల్పించారు. అయితే, పదవుల పంపకంపై రాష్ట్రంలో పంచాయతీ కొనసాగుతోంది. మంత్రుల శాఖల వివరాలను ముద్రించే గెజెట్‌‌ను గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు సవరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రులూ ఎరుగని అయోమయ పరిస్థితిని యడ్యూరప్ప ఎదుర్కొంటున్నారుkarnataka;mahesh;anand malayalam actor;nithya new;bharatiya janata party;karnataka - bengaluru;congress;రాజీనామా;panchayati;chief minister;kannada;minister;aqua;tuberculosis;march;kshanam;anand deverakonda;party;mantraరసవత్తరంగా మారుతున్న కర్ణాటక రాజకీయాలురసవత్తరంగా మారుతున్న కర్ణాటక రాజకీయాలుkarnataka;mahesh;anand malayalam actor;nithya new;bharatiya janata party;karnataka - bengaluru;congress;రాజీనామా;panchayati;chief minister;kannada;minister;aqua;tuberculosis;march;kshanam;anand deverakonda;party;mantraTue, 26 Jan 2021 22:10:00 GMTక్రమక్రమంగా కన్నడ నాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సంవత్సర కాలానికి అటూఇటుగా అంటే 14 నెలల కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక దాదాపు ఏడాదిన్నర కిందట పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత పార్టీ నేతల నుంచే ప్రస్తుతం తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కాగా ఐదు రోజులు కిందట కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించి, ఏడుగురికి కొత్తగా చోటుకల్పించారు. అయితే, పదవుల పంపకంపై రాష్ట్రంలో పంచాయతీ కొనసాగుతోంది. మంత్రుల శాఖల వివరాలను ముద్రించే గెజెట్‌‌ను గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు సవరించారు. గతంలో ఏ ముఖ్యమంత్రులూ ఎరుగని అయోమయ పరిస్థితిని యడ్యూరప్ప ఎదుర్కొంటున్నారు.


సుదీర్ఘ కాలం తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించానన్న ఆనందం ఆయన ముఖంలో మచ్చుకైనా కనిపించకపోగా.. నిత్యం బుజ్జగింపులు, సవరణలతో కాలం వెళ్లదీస్తున్నారు. తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్న యడ్డీ.. మంత్రివర్గ విస్తరణతో ఊరట లభిస్తుందని భావించారు. అయితే, ఆయన అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. శాఖల విషయంలో కొత్త మంత్రుల్లో అసంతృప్తి నెలకొనగా.. పదవులు దక్కనివారు గుర్రుగా ఉన్నారు. పట్టుబట్టి తాను నిర్వహిస్తున్న వైద్యవిద్యా శాఖను డాక్టర్‌ కే. సుధాకర్‌ తిరిగి దక్కించుకోగా.. ఎంతగా ప్రయత్నించినా కూడా చిన్ననీటి పారుదల శాఖ మాత్రం మధుస్వామికి దక్కలేదు. దీంతో తన అసమ్మతికి తీవ్ర రూపం ఏమిటో బయటపెట్టాలన్న పట్టుదలతో మధుస్వామి ఉన్నారు. అతి కష్టం మీద తన కార్యాలయానికి వచ్చిన నగరపాలక మంత్రి ఎంటీబీ నాగరాజు తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇవ్వాలని ముఖ్యమంత్రిని వెంటాడుతున్నారు. అటవీ శాఖ.. ఆపై పర్యాటకం, తాజాగా వక్ఫ్‌ శాఖకు బదిలీ అయిన ఆనంద్‌సింగ్‌ అసమ్మతులందరికీ తన శాఖలు ఇచ్చినా బాధపడనని నర్మగర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. కీలక శాఖ నుంచి ప్రాధాన్యతలేని శాఖలకు బదిలీ చేయడం వల్ల తన సామర్ధ్యంపై ప్రజల మనస్సులో సందేహాలకు తావిస్తోందని వాపోయారు. అంతేకాదు, ‘తాను మంత్రి పదవి కోరుకోవడంలేదు.. కావున తనను ఎమ్మెల్యేగానే కొనసాగించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను.. ఈ విషయమై యడ్యూరప్పను బుధవారం కలుస్తాను’అని ఆనంద్ సింగ్ అన్నారు.


సమీప భవిష్యత్తులో యడ్యూరప్పకు కష్టాలు తీవ్రమవుతాయని, బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 16 మంది ఎమ్మెల్యేలలో మహేష్ కుమతహల్లి మార్చి తరువాత మంత్రి అవుతారని జల వనరుల శాఖ మంత్రి రమేష్ జర్కిహోలి వ్యాఖ్యానించారు. కుమతహల్లితోపాటు ఎన్ మునిరత్న, ప్రతాపగౌడ పాటిల్ (ఉప-ఎన్నికల్లో మాస్కీ నుంచి గెలిస్తే) తప్పనిసరిగా చేర్చుకోవాలి. ‘ఒకే ఒక ఖాళీ ఉన్నందున, రెండింటికి అనుగుణంగా సీఎం ఒక మంత్రిని వదులుకోవాలి.. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది’ అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇంకా పదవులు దక్కని వారు ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రిపై దండెత్తే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారని, వారిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు యడ్యూరప్ప తన మంత్రులను సంప్రదించలేదు. ఏదేమైనా, అతని విధేయులు మాత్రం ఈ అసమ్మతిని కొట్టిపారేస్తున్నారు. మధుస్వామి, ఆనంద్ సింగ్ మాత్రమే కలత చెందారని, మధుస్వామి తాను కోరుకున్నది పొందగా, సింగ్ తదుపరి పునర్వవస్థీకరణ కోసం వేచి ఉండటానికి అంగీకరించాడని అంటున్నారు.




బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>