PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govte59123e7-24e2-43bc-b18e-5c682d3dc397-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govte59123e7-24e2-43bc-b18e-5c682d3dc397-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేప‌థ్యంలో వేగంగా ప్ర‌క్రియ ముందుకు సాగుతోంది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఉద్యోగులకు హడావుడి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను ap;kumaar;adhithya;andhra pradesh;panchayati;february;population;marchఏపీలో ఎన్నిక‌లు... ఆ పంచాయ‌తీలకు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌...ఏపీలో ఎన్నిక‌లు... ఆ పంచాయ‌తీలకు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌...ap;kumaar;adhithya;andhra pradesh;panchayati;february;population;marchTue, 26 Jan 2021 21:14:21 GMTఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేప‌థ్యంలో వేగంగా ప్ర‌క్రియ ముందుకు సాగుతోంది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభం కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఉద్యోగులకు హడావుడి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని.. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో విడతకు రీషెడ్యూల్ చేశారు.  మొత్తం నాలుగు విడ‌త‌ల్లో పోలింగ్ పూర్తి చేసేలా ఎన్నిక‌ల క‌మిష‌న్ రీ షెడ్యూల్ చేసిన విష‌యం తెలిసిందే.


మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి. ఇదిలా ఉండ‌గా ఏక‌గ్రీవ పంచాయ‌తీల‌కు ప్రొత్సాహాకాల‌ను ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించ‌డం క‌ద్దు. ఈనేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ఏక‌గ్రీవ పంచాయ‌తీల‌కు భారీగా ప్రొత్సాహాకాల‌ను ప్ర‌క‌టించింది.


పంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2 వేల లోపు పంచాయతీలకు 5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షలు. 5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన పంచాయితీలకు 15 లక్షల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది. 15 వేల జనాభా దాటిన పంచాయితీలు ఏకగ్రీవం అయితే 20 లక్షల ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వం శాంతియుతంగా ఏకగ్రీవం అయిన పంచాయతీలకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.





బండిని పార్లమెంట్ లో టార్గెట్ చేస్తారా...?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>