MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-newsc15c0657-fd58-410c-94ad-0cb037e8590d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-newsc15c0657-fd58-410c-94ad-0cb037e8590d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లోనే కాక తన విధానంలో కూడా చాలా వైవిద్యం చూపుతుంటారు. తెలుగులో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బాలయ్య. బాబు ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంచితే ఒక్క సినిమాల పరంగానే కాక రాజకీయాల్లో కూడా రానిస్తూ ప్రజల్లో తనకున్న స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.latest news;ntr;balakrishna;ankhita;boyapati srinu;hyderabad;tollywood;cinema;telugu;nandamuri balakrishna;cancer;letter;lung cancer;nandamuri taraka rama rao;legend;simha;massబాలయ్య.. కరోనా పై కామెంట్స్ !!బాలయ్య.. కరోనా పై కామెంట్స్ !!latest news;ntr;balakrishna;ankhita;boyapati srinu;hyderabad;tollywood;cinema;telugu;nandamuri balakrishna;cancer;letter;lung cancer;nandamuri taraka rama rao;legend;simha;massTue, 26 Jan 2021 22:00:00 GMTటాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లోనే కాక తన విధానంలో కూడా చాలా వైవిద్యం చూపుతుంటారు. తెలుగులో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బాలయ్య. బాబు ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్ కి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంచితే ఒక్క సినిమాల పరంగానే కాక రాజకీయాల్లో కూడా రానిస్తూ ప్రజల్లో తనకున్న స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

 తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రజలు పాటుపడాలని కోరారు. .. మన టీకా విదేశాలకు ఉపయోగపడడం ఎంతో గర్వకారణమని. కరోనా కాలంలో కూడా వైద్యులు ఎంతో అంకిత భావంతో సేవలు అందించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని అన్నారు.బసవతారకంలోనూ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. గ్రహణ మొర్రి బాధిత చిన్నారులు 3200 మందికి ఉచితంగా చికిత్స చేసినట్లు ఈ సందర్భంగా ఆయన  వెల్లడించారు. సేవభావంతో కాన్సర్ రోగులకోసం ఎన్టీఆర్ ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి బాలయ్య నివాళులు అర్పించారు.

 ప్రతి ఒక్కరూ కూడా కరోనా ను నిర్లక్ష్యం చేయకూడదని, వ్యాక్సిన్ వచ్చిందని అశ్రద్ద వహించకూడదని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే హ్యాట్రిక్ మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నడని సమాచారం. మరి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా ,లెజెండ్ చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.


స్ట్రేంజర్ తో చేయాలనీ ఉందట..అనుపమ మరీ ఇంత బోల్దా?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>