MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-cried0a1f0c7e-6cce-402d-a717-1e933393e23d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-cried0a1f0c7e-6cce-402d-a717-1e933393e23d-415x250-IndiaHerald.jpgఆ మాటలు విన్న నిహారిక ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఇంతకీ చైతు ఏమన్నారంటే ...డియర్ నిహా.. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి.. నువ్వు వచ్చాకే 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం మిస్ అయ్యానో.. ఏం కోల్పోయానో అర్థమైంది.. niharika cried;jeevitha rajaseskhar;naga chaitanya;niharika konidela;prema;uday kiran;marriage;december;2020;love;husband;wife;heroine;chaitanya 1;allari;santosham;anandamమెగా డాటర్ నిహారికను ఏడిపించిన భర్త...? అంతలోనే ఏమి జరిగిందబ్బా...?మెగా డాటర్ నిహారికను ఏడిపించిన భర్త...? అంతలోనే ఏమి జరిగిందబ్బా...?niharika cried;jeevitha rajaseskhar;naga chaitanya;niharika konidela;prema;uday kiran;marriage;december;2020;love;husband;wife;heroine;chaitanya 1;allari;santosham;anandamTue, 26 Jan 2021 14:01:29 GMT2020 డిసెంబర్ 9న నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో ఉదయ్ పూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో ఆర్భాటంగా సందడి చేసిన వీరి వివాహ ఖర్చు 40 కోట్లు దాటిందని తెలిసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మెగా డాటర్ నిహారిక... పెళ్లి తరువాత మరింత జోరు పెంచింది. తన లేటెస్ట్ అప్డేట్స్ తో  ఫాలోయర్స్ లో నూతన ఉత్సాహం నింపుతోంది. డిఫరెంట్ స్టైల్ లో ఉన్న ఫోటోలతో అదరగొడుతోంది నిహారిక. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించిన నిహారిక సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతోంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోయర్స్ ను సంపాదించుకున్న నిహారిక ఎప్పటికప్పుడు తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఎప్పుడూ ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించే ఈ అల్లరి ప్రిన్సెస్ ఈసారి తను ఏడ్చి అభిమానులను కూడా ఏడిపించింది. అయితే ఆమెతో కంటతడి పెట్టించింది మరెవరో కాదు ఆమె భర్త చైతన్యనే. ఓ అందమైన వీడియో చేసి... మనసుకు హత్తుకునే అద్భుతమైన మాటలతో ఆమె కంట ఆనంద భాష్పాలు కురిపించారు చైతు. సాధారణంగా పెళ్లి అనగానే... ఆడ పిల్లలకు ఎంత ఆనందంగా ఉంటుందో.. అంతే బాధగా కూడా ఉంటుంది. కోరుకున్న కలల కొత్త జీవితం ఒకవైపు... ఇన్నాళ్లు ఆనందాన్ని పంచి తమకు అండగా నిలబడిన తల్లిదండ్రుల ప్రేమ మరోవైపు.

ఇలా ఆనందం, దుఃఖం రెండు ఒకేసారి వస్తాయి. నిహారిక విషయంలోనూ అదే జరిగింది. చైతుతో తన నూతన జీవితం గురించి ఎంత సంతోషంగా అయితే అడుగులు వేసిందో...తన పెళ్లి సమయంలో తన వాళ్ళని వీడి వెళ్లాలన్న విషయం తలుచుకొని అంతే బాధపడింది. అందులోనూ పెళ్లి పీటల దగ్గరే వెక్కివెక్కి ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య నిహారిక కోసం ఓ వీడియోను రెడీ చేశారు చైతు. అందులో నిహారిక  తన లైఫ్ కి ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చాడు.

ఆ మాటలు విన్న నిహారిక ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఇంతకీ చైతు ఏమన్నారంటే ...డియర్ నిహా.. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న ఈ తరుణంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలి.. నువ్వు వచ్చాకే 30 ఏళ్ళ నా జీవితంలో నేనేం మిస్ అయ్యానో.. ఏం కోల్పోయానో అర్థమైంది.. నీతో గడపబోయే ప్రతీ క్షణాన్నినా చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను’ నేను చేరాల్సిన నా గమ్యం నువ్వే... నీ కోసమే పుట్టాను అంటూ ఎమోషనల్ అయ్యాడు చైతు. ఈ వీడియో చూసిన నిహారిక కూడా ఆనంద భాష్పాలు కురిపించింది.


రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>