PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-janasena97ab9352-271e-472c-b761-947b2e7e1be6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-janasena97ab9352-271e-472c-b761-947b2e7e1be6-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలో త‌మ‌కే వ‌దిలేయాల‌ని ముందు ప‌ట్టుబ‌ట్టినా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు స‌హా ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు.. రంగంలోకి దిగి.. మ‌ధ్యేమార్గంగా ఉమ్మ‌డి అభ్య‌ర్థిని దింపాల‌ని నిర్ణ‌యిచుకున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు తొలుత ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆయ‌న‌కు నిల‌క‌డ లేద‌ని.. భావించిన నేత‌లు..ఆ య‌న‌పేరును ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌హిళ‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించాయి. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌.. ఏపీbjp janasena;view;kishore;tiru;bharatiya janata party;assembly;minister;letterతిరుప‌తిలో బీజేపీ- జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఆ మ‌హిళా నేత ఫిక్స్‌..!తిరుప‌తిలో బీజేపీ- జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఆ మ‌హిళా నేత ఫిక్స్‌..!bjp janasena;view;kishore;tiru;bharatiya janata party;assembly;minister;letterTue, 26 Jan 2021 08:20:45 GMTఅసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఈ రెండు పార్టీలూ జ‌ట్టుక‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పొత్తు పార్టీలకు తొలిసారి ఎదురైన ఎన్నిక తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నికే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావించింది. తాము గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను వ‌దులుకున్నాం క‌నుక‌.. త‌మ‌కు కేటాయించాల‌ని పేర్కొంది.

అయితే, దీనిపై క‌మిటీ వేసిన‌.. బీజేపీ పెద్ద‌లు.. ఈ లోగా ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగాపావులు క‌ద‌ప‌డం ప్రారంభించాయి. ఈ క్ర‌మంలో ఏకంగా పార్ల‌మెంటరీ ఆఫీస్‌ను కూడా ప్రారంభించింది. దీంతో విష‌యం ముదురుతోంద‌ని భావించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. ఇటీవ‌ల తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో త‌మ‌కే వ‌దిలేయాల‌ని ముందు ప‌ట్టుబ‌ట్టినా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు స‌హా ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు.. రంగంలోకి దిగి.. మ‌ధ్యేమార్గంగా ఉమ్మ‌డి అభ్య‌ర్థిని దింపాల‌ని నిర్ణ‌యిచుకున్నారు.

ఈ క్ర‌మంలో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు తొలుత ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆయ‌న‌కు నిల‌క‌డ లేద‌ని.. భావించిన నేత‌లు..ఆ య‌న‌పేరును ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌హిళ‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించాయి. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన‌.. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను ఇక్క‌డ నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రంగంలోకి దింపాల‌ని దాదాపు నిర్ణ‌యించుకు న్న‌ట్టు స‌మాచారం. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ర‌త్న‌ప్ర‌భ‌.. క‌ర్ణాట‌క‌లో ఐఏఎస్‌గా అనేక బాధ్య‌త‌లు చేప‌ట్టి.. విజ‌యవంతంగా నిర్వ‌హించారు.

ముఖ్యంగా అవినీతి లేని అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఇక‌, గ‌త క‌ర్ణాటక ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు తెర‌వెనుక చ‌క్రం తిప్పిన అధికారిగా ఆమెకు పేరుంద‌ని బీజేపీ నేత‌లు చెప్పుకొనేవారు. ఈ క్ర‌మంలో ఆమెకు తిరుప‌తి పార్ల‌మెంటు అభ్య‌ర్తిగా టికెట్ ఇవ్వాల‌నిబీజేపీ-జన‌సేన‌లు సంయుక్తంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.




మొదటి భర్త కోసం లేచిపోయిన సునీత.. అసలేం జరిగింది..?

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>