PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddybc4eca6e-f4e1-4b24-8a51-f9fa1b81233a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddybc4eca6e-f4e1-4b24-8a51-f9fa1b81233a-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాపై నిప్పులు చెరిగారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఢిల్లీలో దాడి జరగడం అమానుషమని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులపై జరిగిన దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. revanth reddy;modi;amit shah;revanth;vijay;delhi;korea, south;telangana;narendra modi;revanth reddy;congress;mp;government;police;prime minister;parliment;history;minister;fire;letter;traffic police;joseph vijay;central government;reddy;narendraప్రధాని మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలుప్రధాని మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలుrevanth reddy;modi;amit shah;revanth;vijay;delhi;korea, south;telangana;narendra modi;revanth reddy;congress;mp;government;police;prime minister;parliment;history;minister;fire;letter;traffic police;joseph vijay;central government;reddy;narendraTue, 26 Jan 2021 20:33:00 GMTప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాపై నిప్పులు చెరిగారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. దేశానికి అన్నం పెట్టే రైతులపై ఢిల్లీలో దాడి జరగడం అమానుషమని మండిపడ్డారు.  నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులపై జరిగిన దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని  రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడితో మోడీ, అమిత్‌షా జోడి పతనానికి నాంది పడిందన్నారు.

         దేశంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించిందన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే రైతుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతన్నలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని  డిమాండ్ చేశారు.

         ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతుల‌పై పోలీసుల లాఠీచార్జ్, బాష్ప‌వాయువు గోళాలు ప్ర‌యోగించ‌టంపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ కి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని మండిప‌డ్డారు. ఢిల్లీ వీధుల్లో రైతన్న పై దాడి చేసిన చరిత్ర ప్రధాన మంత్రి మోడి కే దక్కుతోందన్నారు రేవంత్. ఇది రైతు ప్రభుత్వం కాదని.. అదాని, అంబానీల ప్రభుత్వమ‌ని ఆరోపించారు.

  ఢిల్లీ ఐటీవో వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లను మూసివేయించారు. రైతుల ఆందోళన మరింత ఉద్ధృతమవుతుందన్న అంచనాల నేపథ్యంలో విజయ్ చౌక్, పార్లమెంట్ భవన్, నార్త్ సౌత్ బ్లాక్ ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సాధారణ ప్రజలు, పర్యాటకులు వెళ్లిపోవాలని పోలీసులు, భద్రతా సిబ్బంది హెచ్చరించారు. 


అబ్బే... మేము సుప్రీం కోర్ట్ కి వెళ్ళలేదు: ఉద్యోగుల కీలక వ్యాఖ్యలు

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>