MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/problems-araising-to-anushka-and-samanthafcfae99a-c9a8-4cda-bddb-d506cb75501e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/problems-araising-to-anushka-and-samanthafcfae99a-c9a8-4cda-bddb-d506cb75501e-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా సమంత అనుష్క లు ఎదిగారు. అనుష్క అయితే ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగినా ఆమెకు రోజురోజుకు అవకాశాలు తగ్గిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇక అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత సమంతకు కూడ బాగా అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ తాను గ్లామర్ హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అని సమంత సంకేతాలు ఇస్తూ అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నా ఆమెను టాప్ హీరోలు మాత్రమే కాదు మిడిల్ రేంజ్ హanushka;chiranjeevi;rana;anoushka;gunasekhar;kajal aggarwal;nageshwara rao akkineni;nayantara;samantha;cinema;bahubali;industry;hero;heroine;newsసమంత అనుష్క లకు మొదలైన ఎదురీత !సమంత అనుష్క లకు మొదలైన ఎదురీత !anushka;chiranjeevi;rana;anoushka;gunasekhar;kajal aggarwal;nageshwara rao akkineni;nayantara;samantha;cinema;bahubali;industry;hero;heroine;newsTue, 26 Jan 2021 08:00:00 GMTదక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా సమంత అనుష్క లు ఎదిగారు. అనుష్క అయితే ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగినా ఆమెకు రోజురోజుకు అవకాశాలు తగ్గిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ఇక అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత సమంతకు కూడ బాగా అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ తాను గ్లామర్ హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అని సమంత సంకేతాలు ఇస్తూ అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నా ఆమెను టాప్ హీరోలు మాత్రమే కాదు మిడిల్ రేంజ్ హీరోలు కూడ పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


తెలుస్తున్న సమాచారంమేరకు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీలో దుష్యంతుడి పాత్రలో నటించడానికి రానా తో సహా ఏ ఒక్క మిడిల్ రేంజ్ హీరో సమంత పక్కన నటించడానికి ఒప్పుకొని పరిస్థితులలో ఒక మళయాళ నటుడుని ఈ దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేయవలసి వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క పక్కన నటించడానికి టాప్ హీరోలు మాత్రమే కాకుండా మిడిల్ రేంజ్ హీరోలు కూడ ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.


ఆమెతో నటించేకన్నా శ్రుతిహాసన్ కాజల్ లతో నటిస్తాము కానీ తమకు అనుష్క సమంత వద్దు అంటూ ఉండటంతో వారిని ఎంపిక చేద్దామని దర్శక నిర్మాతలు భావిస్తున్నా వారి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని టాక్. దీనికితోడు వీరిద్దరూ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు సక్సస్ రేట్ అంతంత మాత్రంగా ఉండటంతో వీరితో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వీరిని దృష్టిలో పెట్టుకుని కథలు వ్రాసే రచయితలు కూడ కరువయ్యారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కంటే వయసులో పెద్ద అయిన నయనతార మ్యానియా ఇంకా కొనసాగుతూ ఉంటే మంచి హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నా వీరిద్దరికీ ఈ ఎదురీత ఎందుకు వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..





ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>