Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దూసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఉద్యమ బాట పట్టాయి అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఎంతో చలి వాతావరణాన్ని తట్టుకుంటూ వేల సంఖ్యలో రైతులు నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే కేంద్రం దిగివచ్చి పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు మాత్రం విజయవంతం కాలేదు అని చెప్పాలి. ఇకపోతే రైతులు రోజుల తరబడి నిరసనలు చేస్తున్నప్పటికీ ఎంతోమంది చలి వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదులు తున్న ప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్farmers;modi;sharath;delhi;maharashtra - mumbai;sharad pawar;government;heart;governor;maharashtra;congress-ncp;central government;sharrath marar1కంగానా ను కలుస్తారు.. కానీ రైతులను కలవరేం..?కంగానా ను కలుస్తారు.. కానీ రైతులను కలవరేం..?farmers;modi;sharath;delhi;maharashtra - mumbai;sharad pawar;government;heart;governor;maharashtra;congress-ncp;central government;sharrath marar1Tue, 26 Jan 2021 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా దూసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా రైతు సంఘాలు ఉద్యమ బాట పట్టాయి అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఎంతో చలి వాతావరణాన్ని తట్టుకుంటూ వేల సంఖ్యలో రైతులు నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే కేంద్రం దిగివచ్చి పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు మాత్రం విజయవంతం కాలేదు అని చెప్పాలి.  ఇకపోతే రైతులు రోజుల తరబడి నిరసనలు చేస్తున్నప్పటికీ ఎంతోమంది చలి వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదులు తున్న ప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మోడీ సర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఎంతో మంది రైతన్నల గుండె చప్పుడు ఆగి పోతున్నప్పటికీ.. ఎక్కడ మోడీ  మనసు మాత్రం కరగడం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలె రైతుల ఉద్యమం పై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 60 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శరత్ పవర్.


 ముంబైలోని ఆజాద్ మైదానం వద్ద రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో మహారాష్ట్ర గవర్నర్ తీరును కూడా తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నర్ కు కంగానా ను  కలిసే సమయం ఉంది.. కానీ రైతులను కలిసే సమయం మాత్రం లేదా అంటూ ప్రశ్నించారు శరత్ పవర్. ఆందోళన చేస్తున్న రైతులు అందరినీ కలవడం గవర్నర్ నైతిక బాధ్యత అంటూ హితవు పలికారు.


ప్రేమ కోసం ఇంతగా తెగిస్తారా!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>