EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pranalaku-ktr-nundi-ponchi-unna-muppucfac32cf-eb21-44a2-a08b-9ca406252e79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-pranalaku-ktr-nundi-ponchi-unna-muppucfac32cf-eb21-44a2-a08b-9ca406252e79-415x250-IndiaHerald.jpgస‌త్య‌మేవ జ‌య‌తే...! అబ‌ద్దాల‌తో నిజాల‌ను క‌ప్పిపెట్టాల‌ని చూసినా ఎప్పుడోక‌ప్పుడు నిజ‌మే బ‌య‌ట‌ప‌డుతుంది. చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే అనేక మంది విష‌యంలో, అనేక సార్లు ఈ వాక్యం రుజువైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే కూడా చాలా మందికి ఈ వాక్యం స్ఫూరిస్తోంది. ఈ విష‌యాన్ని టీఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆల‌స్యంగానైనా గుర్తిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌కు ప్ర‌యోమోదం లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఎడాపెడkcr ktr;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;party;mantraఆ ఇద్ద‌రి నిర్ణ‌యాలు.. వైఖ‌రితోనే టీఆర్ ఎస్‌కు చేటు...ఆ ఇద్ద‌రి నిర్ణ‌యాలు.. వైఖ‌రితోనే టీఆర్ ఎస్‌కు చేటు...kcr ktr;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;party;mantraTue, 26 Jan 2021 13:36:51 GMTతెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే కూడా చాలా మందికి ఈ వాక్యం స్ఫూరిస్తోంది. ఈ విష‌యాన్ని టీఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆల‌స్యంగానైనా గుర్తిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌కు ప్ర‌యోమోదం లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఎడాపెడా నిర్ణ‌యాల‌తో ఆర్థిక వృథాతో పాటు అవ‌స‌రార్థం వేచి వ‌ర్గాల‌కు ప‌థ‌కాల రూపంలో ఫ‌లాలు అంద‌కుండా పోతున్నాయి.


గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్ స‌క్ర‌మంగా సాగ‌క‌పోవ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అనేక శాఖ‌ల్లో వేల సంఖ్య‌లో ఖాళీలు ఏర్ప‌డిన ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఓవైపు ఉద్యోగులు, నిరుద్యోగులు ప్ర‌భుత్వంపై గుర్రుగా, ఆగ్ర‌హంతో ర‌గిలిపోతుండ‌గా ఇప్పుడు వీరికి సొంత పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు సైతం తోడవుతున్నారు. ప‌ద‌విలో ఉన్నాం కాబ‌ట్టి మేం నోరువిప్పితే బాగుండ‌దు అనుకుంటూనే అస‌మ్మ‌తిని వెళ్ల‌గ‌క్కుతున్న మంత్రులూ ఉన్నారు. గ‌డిచిన ఏడాదిన్న‌ర కాలంలోనే పార్టీపై, ప్ర‌భుత్వంపై ఇంత‌లా అస‌మ్మ‌తి పెర‌గ‌డానికి కార‌ణం మాత్రం కేసీఆర్‌, కేటీఆర్‌ల వైఖ‌రే అంటూ కొంత‌మంది కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.


 ప్ర‌భుత్వం ప‌రంగా ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు ప్ర‌జామోదం ల‌భించ‌డం లేద‌న్న‌ది వారి వాద‌న‌. అలాగే కేటీఆర్ కొంత‌మంది నేత‌ల‌కే పార్టీలో ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు... ఆ కుటుంబాల‌కే రాజ‌కీయ‌, పార్టీ ప‌ద‌వులు అప్ప‌గిస్తుండ‌టం, సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఈక్ర‌మంలోనే అస‌మ్మ‌తి సెగ‌లు ఎగిసిప‌డుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీ ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీలాంటింద‌ని,  పార్టీలో చేరాక త‌న స‌హ‌జ‌త్వాన్ని కోల్పోయాన‌ని, ప‌రిమితులతో  మాట్లాడాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నారు. పార్టీలో ఉన్న నియంతృత్వ ధోర‌ణికి ర‌స‌మయి వ్యాఖ్య‌లు అర్థం ప‌డుతున్నాయ‌నే చ‌ర్చ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఒక్క‌టి మాత్రం నిజం మ‌సిపూసి మారేడుగాయ జేయాల‌ని చూసిన నేత‌ల‌కు భ‌యాందోళ‌న క‌లుగుతోంది. తెలంగాణ స‌మాజం గుడ్డిది కాదు.. ఎడ్డిది అంత‌క‌న్నా కాదు. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చేశాయి. ప్ర‌జాచైత‌న్యానికి ప్ర‌తిబింబం అన్న విశ్లేష‌ణ జ‌రిగింది. ఇప్ప‌టికైనా టీఆర్ ఎస్ ప్ర‌జామోదం నిర్ణ‌యాలు తీసుకుంటేనే భ‌విష్య‌త్ ఉంటుంది.




నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>