PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap510358a7-4f04-4ad6-a324-93f47261d551-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap510358a7-4f04-4ad6-a324-93f47261d551-415x250-IndiaHerald.jpgఏపీ ఇపుడు అందరి నోళ్ళలో నానుతోంది. విభజన తరువాత కొంతకాలం ఏపీ గురించే దేశంలో ఒక్క లెక్కన చర్చ సాగింది. ఆ తరువాత‌ చూస్తే మళ్ళీ ఇపుడే అలాంటి చర్చ సాగుతోంది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. గొప్ప రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి దేనికీ లేని స్పెషాలిటీ ఏపీకి ఏముంది. ap;jagan;andhra pradesh;courtఏపీ మీద బిగ్ ఫోకస్ పెట్టేశారు...?ఏపీ మీద బిగ్ ఫోకస్ పెట్టేశారు...?ap;jagan;andhra pradesh;courtTue, 26 Jan 2021 21:00:00 GMTఏపీ ఇపుడు అందరి నోళ్ళలో నానుతోంది. విభజన తరువాత కొంతకాలం ఏపీ గురించే దేశంలో ఒక్క లెక్కన చర్చ సాగింది. ఆ తరువాత‌ చూస్తే మళ్ళీ ఇపుడే అలాంటి చర్చ సాగుతోంది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. గొప్ప రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి దేనికీ లేని స్పెషాలిటీ ఏపీకి ఏముంది.

ఎందుకు మరి  ఏపీ వైపే కెమెరా కళ్ళు పెట్టేశారో అర్ధం కావడం లేదు. ఏపీలో గత ఇరవై నెలలుగా జగన్ పాలన సాగుతోంది. జగన్ అధికారంలోకి రావడంతో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటి మీద ఓ వైపు చర్చ సాగుతోంది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ మీద ఏపీ సర్కార్ పోరాటం కూడా దేశాన్ని ఆకట్టుకుంటోంది. అదే విధంగా గత ఏడాదిగా రాజ్యాంగ సంస్థల తో కూడా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కూడా ఇపుడు దేశమంతా తిలకిస్తోంది.

ఇది దేశం ఎపుడూ ఎరగనిది. ఎందరో ముఖ్యమంత్రులు దేశాన్ని పాలించారు. ఎందరో పట్టుదల కలిగిన వారు మంకు పట్టు ఉన్న వారు కూడా దేశంలో అనేక రాష్ట్రాలకు ఏలికలు అయ్యారు. వారంతా కూడా ఎపుడూ ఇంతటి ఘర్షణలు రాజ్యాంగ వ్యవస్థలతో కానీ కోర్టులతో కానీ పడలేదు.

దాంతో ఏపీ మీద ఇపుడు బిగ్ ఫోకస్ పెట్టి అంతా చూస్తున్నారు. ఏపీలో ప్రతీ విషయం కోర్టులకు వెళ్లడం తెగేదాకా లాగడం కూడా దేశంలో చర్చకు వస్తోంది. అయితే దీని మీద పాజిటివ్ గా, నెగిటివ్ గా కూడా చర్చలు జరుగుతున్నాయి. పాజిటివ్ డిస్కషన్ ఏంటి అంటే ఇలా కూడా చేయవచ్చా, చేస్తే ఏమవుతుంది. ఎంతదాకా చేయవచ్చు అన్నది ఒకటైతే ఏపీ లాంటి కొత్త రాష్ట్రానికి ఇవన్నీ అవసరమా అని నెగిటివ్ చర్చ కూడా సాగుతోంది. ఏపీలో జరుగుతున్న పోరాటల ద్వారా రాజ్యాంగ వ్యవస్థల  గొప్పదనం మరో మారు దేశానికి దేశంలోని ఇతర పౌరులకు  కూడా తెలిసివస్తోంది అంటున్నారు. మొత్తానికి మంచికో చెడుకో ఏపీ పేరు దేశంలో మారుమోగుతోంది అనుకోవాలి.




బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>