PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/three-capitals-jagan6ca6c4dc-5e0d-420d-be9d-2026612b7a7d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/three-capitals-jagan6ca6c4dc-5e0d-420d-be9d-2026612b7a7d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ గ‌తంలో ఇబ్బందులు సృష్టించింద‌ని చెప్పారు. దాని వ‌ల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌లెత్తాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను కీల‌కంగా భావిస్తోంద‌న్నారు గవర్నర్ బిశ్వభూషణ్. ప్రాంతీయ స‌మాన‌త‌ల కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని తెలిపారుthree capitals jagan;andhra pradesh;governor;central government;ammavodi;amaravathi;paruguమూడు రాజధానులు అవసరమన్న ఏపీ గవర్నర్!మూడు రాజధానులు అవసరమన్న ఏపీ గవర్నర్!three capitals jagan;andhra pradesh;governor;central government;ammavodi;amaravathi;paruguTue, 26 Jan 2021 11:48:30 GMTఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా వికేంద్రీకరణతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్. అభివృద్ధి కేంద్రీక‌ర‌ణ గ‌తంలో ఇబ్బందులు సృష్టించింద‌ని చెప్పారు. దాని వ‌ల్ల ప్రాంతీయ అస‌మాన‌త‌లు త‌లెత్తాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ను కీల‌కంగా భావిస్తోంద‌న్నారు గవర్నర్ బిశ్వభూషణ్. ప్రాంతీయ స‌మాన‌త‌ల కోసం మూడు రాజ‌ధానులు అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని భావిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేయాల‌నుకుంటున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి శాస‌న‌రాజ‌ధానిగా ఉంటుందని  బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.


      విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వ‌హించిన‌ 72వ గణతంత్ర వేడుకల సంద‌ర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, లక్ష్యాలు వివరించారు. రాష్ట్రంలో పేద‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, ఇళ్ల ప‌థ‌కానికి రూ.28,084 కోట్లు ఖ‌ర్చుచేసింద‌ని గవర్నర్ తెలిపారు. రూ.23,535 కోట్ల విలులైన భూముల‌ను పేద‌ల‌కు ఇచ్చిన‌ట్లు చెప్పారు.  రైతుల భ‌రోసా కింద రూ.13,101 కోట్లు అందించామన్నారు. 2 ల‌క్ష‌ల బోర్ల ద్వారా కొత్త‌గా 5 ల‌క్ష‌ల ఎక‌రాల పంట‌ల‌ను సాగులోకి తెస్తామ‌ని  చెప్పారు. పాడి రైతుల కోస‌మే అమూల్‌తో త‌మ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంద‌ని గవర్నర్ తెలిపారు. అమ్మఒడి ద్వారా త‌ల్లుల ఖాతాల్లో రూ.13,121 కోట్లు వేసిన‌ట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 2,436 జ‌బ్బుల‌కు చికిత్సలు అందిస్తున్నామ‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనాను ఎదుర్కొని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంస‌లు పొందిన‌ట్లు హరిచందన్ చెప్పారు.

     ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను దెబ్బ‌తీసేలా కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. రాష్ట్రంలో మ‌త ప‌ర‌మైన వివాదాల‌ను సృష్టించ‌డానికి కొంద‌రు కుట్ర‌లు ప‌న్నార‌ని  చెప్పారు. అయితే, త‌మ ప్ర‌భుత్వం ఆ కుట్ర‌ల‌ను స‌మ‌ర్థంగా అడ్డుకోగ‌లిగింద‌ని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.


చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>