PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/latest-news0476934f-9ecc-4e5a-8b5c-5a915c5da5d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/latest-news0476934f-9ecc-4e5a-8b5c-5a915c5da5d2-415x250-IndiaHerald.jpg జగనోరు ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా పదవి బాద్యతలు చేపట్టినప్పటి నుండి పలు సందర్భాలు జగనోరి మొండి వైఖరికి అద్దం పడుతున్నాయి. అమరావతి లో ప్రజావేధిక కూల్చివేత మొదలు..తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల వ్యవహారం వరకు చాలా సందర్భాలు జగనోరి భాద్యత రహిత పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల పై పంతనికి పోయి రాష్ట్ర ప్రజల ఎదుట జగనోరు నవ్వులపాలు అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే కరోనా కేసులు అధికంగా ఉన్న పలు రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే ఏపీ లో మాత్రం కరోనా పేరు చెప్పి వాయిదా వేయాలని latest news;ramakrishna;amaravati;andhra pradesh;high court;panchayati;letter;local language;march;reddyఇప్పుడు రెడీ అంటున్నారు అప్పుడేమైంది ..జగనోరు !!ఇప్పుడు రెడీ అంటున్నారు అప్పుడేమైంది ..జగనోరు !!latest news;ramakrishna;amaravati;andhra pradesh;high court;panchayati;letter;local language;march;reddyTue, 26 Jan 2021 15:07:00 GMT జగనోరు ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా పదవి బాద్యతలు చేపట్టినప్పటి నుండి పలు సందర్భాలు జగనోరి మొండి వైఖరికి అద్దం పడుతున్నాయి. అమరావతి లో ప్రజావేధిక కూల్చివేత మొదలు..తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల  వ్యవహారం వరకు చాలా సందర్భాలు జగనోరి భాద్యత రహిత పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల పై పంతనికి పోయి రాష్ట్ర ప్రజల ఎదుట జగనోరు నవ్వులపాలు అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే కరోనా కేసులు అధికంగా ఉన్న పలు రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే ఏపీ లో మాత్రం కరోనా పేరు చెప్పి వాయిదా వేయాలని చూస్తూ వచ్చింది జగనోరి సర్కార్. 

గత ఏడాది నుండి స్థానిక ఎన్నికల పై ఎస్ఈసి కి రాష్ట్ర ప్రభుత్వానికి మద్య వివాదం జరుగుతూనే ఉంది. అప్పుడు కరోనా విజృంభణ కారణంగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వెయ్యడంతో, ఇప్పుడు అదే సాకు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తూ వచ్చింది. అయితే హైకోర్ట్ , సుప్రీం కోర్ట్ , ఎన్నికలు నిర్వహించాల్సిందే అని తీర్పు ఇవ్వడంతో జగనోరి ప్రభుత్వానికి చెంప పెట్టులా మారింది. ఇక చేసేదేమీ లేక ఎన్నికల నిర్వహణకు అంగీకరించారు జగనోరు. దీంతో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అంటూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు.  ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వానిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

 ఇప్పటికే పంచాయతీ ఎన్నికల  ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సజ్జల స్పష్టం చేశారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, ఇక ఏం జరిగినా ఎస్ఈసీ నే బాధ్యత వహించాలని సజ్జల వ్యాఖ్యానించడంతో  ఈ వ్యాఖ్యలపై పలువురు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అరాచకాలు చేసేందుకు సిద్దమౌతుందా.. అన్న కోణంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి సుప్రీం కోర్ట్ నుండి వచ్చిన తీర్పు జగనోరు కు అనుకూలంగా రానందున వెంటనే మాట మార్చి ఎన్నికలకు సిద్దమయ్యారని జగనోరు పై విమర్శలు గుప్పిస్తున్నారు. .  


అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>