Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas72c67d13-4175-4d0c-ab1b-4813fd1785e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas72c67d13-4175-4d0c-ab1b-4813fd1785e4-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రస్తుతం దేశ, విదేశాల్లోనూ ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరుగుతోంది. బాహుబలి తర్వాత అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆకాశాన్నంటింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్‌ను ఫాలో అయ్యేరి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో..prabhas;cbn;prabhas;kumaar;allu arjun;krishnam raju;nag ashwin;prasanth;tollywood;cinema;telugu;bahubali;naga aswin;media;jil;thriller;kgf;arjun 1;vemuri radhakrishna;prashant kishorప్రభాస్ మరో రికార్డ్..ప్రభాస్ మరో రికార్డ్..prabhas;cbn;prabhas;kumaar;allu arjun;krishnam raju;nag ashwin;prasanth;tollywood;cinema;telugu;bahubali;naga aswin;media;jil;thriller;kgf;arjun 1;vemuri radhakrishna;prashant kishorTue, 26 Jan 2021 14:51:40 GMTఇంటర్నెట్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రస్తుతం దేశ, విదేశాల్లోనూ ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరుగుతోంది. బాహుబలి తర్వాత అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆకాశాన్నంటింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్‌ను ఫాలో అయ్యేరి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండనప్పటికీ ఆయనకు ప్రభాస్ ఏకంగా 6 మిలియన్లకు పైగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ రోజే ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో మ‌హేష్ బాబుకు 6.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, అల్లు అర్జున్ 10.2 మిలియ‌న్ , విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు 10.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో మిగతా హీరోలున్నారు. అయితే వీరంతా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో యమా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆన్‌లైన్‌లో అంతగా యాక్టివ్‌గా ఉండకపోయినా, అంతగా పోస్టులు పెట్టకపోయినా ప్రభాస్‌ ఇన్‌స్టాలో 6 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది. ఇన్‌స్టాలోనే కాకుండా, మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఇలానే ఈ సంఖ్య మరింత పెరగాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత బాలీవుడ్‌లో ఓం రవుత్ డైరెక్షన్‌లో మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా ఆదిపురుష్‌ చేయనున్నాడు. ఈ మూడు చిత్రాల తరువాత తెలుగులో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ చిత్రం చేయనున్నాడు. ఈ రంకంగా క్షణం తీరిక లేకుండా ప్రభాస్ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా..? ఎప్పుడెప్పుడు వీటిని చూస్తామా..? అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.




అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>