PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/three9f14b803-ab77-4fdf-b873-0b4d099e8664-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/three9f14b803-ab77-4fdf-b873-0b4d099e8664-415x250-IndiaHerald.jpgమూడు రాజధానులు విషయం ఇపుడు కొంత పాతదిగానే ఉంద్. 2019 డిసెంబర్ శీతాకాల సమావేశాలలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఈ అంశం ప్రస్తావించినపుడు లోకమంతా ఒక్క సారి ఇటు వైపు చూసింది. ఆ తరువాత 2020లో అంతా దీని మీదనే రగడ సాగింది. three;jagan;andhra pradesh;2019;court;chief minister;december;governor;ycpమూడు రాజధానులపైన జగన్ లేటెస్ట్ డెసిషన్ ఇదే ?మూడు రాజధానులపైన జగన్ లేటెస్ట్ డెసిషన్ ఇదే ?three;jagan;andhra pradesh;2019;court;chief minister;december;governor;ycpTue, 26 Jan 2021 20:00:00 GMT2019 డిసెంబర్ శీతాకాల సమావేశాలలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఈ అంశం ప్రస్తావించినపుడు లోకమంతా ఒక్క సారి ఇటు వైపు చూసింది. ఆ తరువాత 2020లో అంతా దీని మీదనే రగడ సాగింది.

అయితే ఇపుడు రిపబ్లిక్ వేడుకల సందర్భంగా జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోట మూడు రాజధానుల మాట   పలికించారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని మరో మారు గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేశారు. మూడు రాజధానులు అవసరం ఏపీలో పూర్తిగా  ఉందని కూడా అందులో పేర్కొన్నారు.

ఏపీలో మూడు ప్రాంతాలలో  అసమానతలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్లనే ఈ నిర్ణయం అని గవర్నర్ ప్రసంగంలో చెప్పడం ద్వారా తాము ఈ విషయంలో తగ్గేది లేదన్న లేటెస్ట్ డెసిషన్ ని ఒకసారి ఏపీ ప్రజలకు తెలియచేసింది. మరో వైపు చూసుకుంటే విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ని న్యాయ రాజధానిగా చేసి తీరుతామని జగన్ సర్కార్ స్పష్టం చేసింది.

ఒక వైపు ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న  అనేక నిర్ణయాలు న్యాయం స్థానాలలో  వీగిపోతున్న నేపధ్యం ఉంది. మరో వైపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా జగన్ ఇదే రకమైన ప్రసంగం చేశారు. ఇపుడు చూస్తే గవర్నర్ నోట కూడా అదే చెప్పించారు. ఇక ఏపీ హై కోర్టులో మూడు రాజధానుల విషయం మీద విచారణ జరుగుతోంది. మరి ఈ తీర్పు రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికీ  తెలియదు కానీ ఏపీ సర్కార్ మాత్రం అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అంటోంది. మొత్తానికి తన స్టాండ్ ఇదేనని మరో మారు జగన్ ప్రభుత్వం గణ తంత్ర వేడుకల సందర్భంగా  రాష్ట్ర ప్రజలకు పక్కాగా క్లారిటీ ఇచ్చినట్లు అయింది.మరి దీని మీద పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.






బండిని పార్లమెంట్ లో టార్గెట్ చేస్తారా...?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>