PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-kisan9509270c-d591-409c-a2be-6bf58674e71b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-kisan9509270c-d591-409c-a2be-6bf58674e71b-415x250-IndiaHerald.jpgప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు 3వేల రూపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే..అయితే కేవలం మూడు వేల రూపాయల రైతులకు ఎటువంటి అవసరం తీరలేదని ఇటీవల రెట్టింపు చేశారు. ఈ మేరకు ఈ పథకం ద్వారా రైతులు 6వేలు వరకు పొందవచ్చు. రూ.6 వేల ఆర్థికసాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. pm kisan;nidhi;nirmala sitharaman;narendra modi;prime minister;february;minister;good news;central government;good newwzరైతులకు మోదీ గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ పై మరోసారి పెంపు..!!రైతులకు మోదీ గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ పై మరోసారి పెంపు..!!pm kisan;nidhi;nirmala sitharaman;narendra modi;prime minister;february;minister;good news;central government;good newwzTue, 26 Jan 2021 12:00:00 GMTప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు 3వేల రూపాయలను అందిస్తున్న సంగతి తెలిసిందే..అయితే కేవలం మూడు వేల రూపాయల రైతులకు ఎటువంటి అవసరం తీరలేదని ఇటీవల రెట్టింపు చేశారు. ఈ మేరకు ఈ పథకం ద్వారా రైతులు 6వేలు వరకు పొందవచ్చు.  రూ.6 వేల ఆర్థికసాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.



కేవలం ఆరు వేల రూపాయలతో ప్రయోజనం చేకూరదు అంటూ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సేవల కోసం ఇకపై అధిక నిధులు కేటాయించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.



ఇకపోతే ఈ రంగానికి జీడీపీలో ఒక శాతానికి పైగా మాత్రమే ఖర్చు చేస్తుండగా.. 2025 నాటికి దీనిని 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకోనుందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రానున్న కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సమకూర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం పౌరులు చెల్లించే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై, కంపెనీలు చెల్లించే కార్పొరేట్‌ ట్యాక్స్‌పై నాలుగు శాతాన్ని హెల్త్‌, ఎడ్యుకేషన్‌ సెస్‌గా వసూలు చేయాలని భావిస్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకుగాను కాలం చెల్లిన వాహనాలకు ఇకపై గ్రీన్‌ ట్యాక్స్‌ విధించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపారు.  


రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు !!

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>