SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/the-legendary-cartoonist-laxmanbaf32184-5232-4e7f-9092-94aa65dc866a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/the-legendary-cartoonist-laxmanbaf32184-5232-4e7f-9092-94aa65dc866a-415x250-IndiaHerald.jpg ఆర్.కె.లక్ష్మణ్ గా ప్రసిద్ధులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ లక్ష్మణ్ (అక్టోబర్ 23 1924 - జనవరి 26 2015) భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ముంబాయి నుండి ప్రచురించబడుతున్న ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India) లో ప్రతిరోజూ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కొన్ని దశాబ్దాలనుండి ఒకే వార్తా పత్రికలో పనిచేస్తూ, తన కార్టూన్లకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఇతను ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను వేస్తూ ఉండేవాడు.cartoonist k.r. laxman;lakshman;prema;santhanam;mumbai;india;cinema;school;january;tamil;writer;love;october;venkaiah naidu;father;lie;chitramరాజ‌కీయ నేత‌ల‌ను ఆట‌ప‌ట్టించిన ఆర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌...రాజ‌కీయ నేత‌ల‌ను ఆట‌ప‌ట్టించిన ఆర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌...cartoonist k.r. laxman;lakshman;prema;santhanam;mumbai;india;cinema;school;january;tamil;writer;love;october;venkaiah naidu;father;lie;chitramTue, 26 Jan 2021 07:00:00 GMTలక్ష్మణ్ (అక్టోబర్ 23 1924 - జనవరి 26 2015) భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. ముంబాయి నుండి ప్రచురించబడుతున్న ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India) లో ప్రతిరోజూ వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కొన్ని దశాబ్దాలనుండి ఒకే వార్తా పత్రికలో పనిచేస్తూ, తన కార్టూన్లకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఇతను ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను వేస్తూ ఉండేవాడు. ఇతను సృష్టించిన సామాన్య వ్యక్తి (Common Man) పాత్ర కార్టూన్ల చరిత్రలో అత్యంత పేరు తెచ్చుకున్న పాత్ర. ఇతడు 1983వ సంవత్సరంలో, ఒక కార్యక్రమానికి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒక పత్రికా విలేఖరి "ఇప్పటికీ మీరు కార్టూన్లు వెయ్యటంలో ఆనందం పొందుతున్నారా" అని అడిగినప్పుడు, "ఇదేం ప్రశ్న!? తప్పకుండా ఆనందిస్తున్నాను, నాకు ఇది పుట్టుకతో వచ్చిన కళ " అని సమాధానమిచ్చాడు. ఇతడు రాజకీయ కార్టూన్లు వేసి భారత దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా ఆటపట్టించి, వారిమీద సద్విమర్శలు చేసి రాజకీయ రంగాన్ని సరైన పంధాలో నడిపించటానికి తనవంతు కృషి చేశాడు. ఎంత ఆట పట్టించినా, లక్ష్మన్ అంటే, రాజకీయ నాయకులందరికీ గౌరవం అంతకుమించి ఎనలేని ప్రేమ. 2003వ సంవత్సరంలో తీవ్ర అస్వస్థులై ఆసుపత్రిపాలైనప్పుడు, దేశంలోని హేమాహేమీలందరూ వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆదుర్దాతో వాకబు చేశాడు. అప్పటి, ఉపరాష్ట్రపతి భైరవ్ సింగ్ షేకావత్, ఆసుపత్రికి వెళ్ళి ఇతడిని పరామర్శించారు. ల‌క్ష్మ‌ణ్ జనవరి 26, 2015న మ‌ర‌ణించారు.



ఆర్కే లక్ష్మణ్ మైసూర్ నగరంలో ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యయుడు. లక్ష్మణ్ ఆరుగురు సంతానంలో చిన్నవాడు. ఇతని అన్నలలో ఒకడైన ఆర్.కె. నారాయణ్  మాల్గుడి డేస్ కథలు రచించిన ప్రముఖ ఆంగ్ల రచయిత. చిన్నతనంలో లక్ష్మణ్ బొమ్మల పుస్తకాలు ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. ఆంగ్ల పత్రికలైన స్ట్రాండ్ , పంచ్ , బైస్టాండర్ , వైడ్-వరల్డ్ , టిట్ బిట్స్  వంటి బొమ్మల కార్టూన్ పుస్తకాలను, తాను చదవటం నేర్వకముందే చూసేవాడు. అలా బొమ్మల పుస్తకాలు చూస్తూ, మెల్లిగా గీతలు గీస్తూ బొమ్మలు వెయ్యటం మొదలుపెట్టాడు. నేల మీద, గోడల మీద, తలుపుల మీద, ఎక్కడ పడితే అక్కడ రకరకాల బొమ్మలు వేసేవాడు. తన ఉపాధ్యాయుల వ్యంగ్య చిత్రాలుకూడ వేసాడు. ఇతడు వేసిన బోధి వృక్షం ఆకు బొమ్మను వీరి టీచర్లు కూడా మెచ్చుకున్నప్పుడు తానొక చిత్రకారుడిగా తయారయ్యే అవకాశం ఉన్నదని భావించాడు.


ఉన్నత పాఠశాల తరువాత, లక్ష్మణ్ బొంబాయి (ఇప్పటి ముంబాయి) లోని జె.జె ఇన్సిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ లో చేరి బొమ్మలు వేయటం నేరుకోవటానికి, తన దరఖాస్తు పంపుకున్నాడు. కాని, ఆ పాఠశాల ప్రధాన అధికారి, ఇతని బొమ్మలు చూసి, అటువంటి బొమ్మలు వేసేవాడు తమ స్కూలులో విద్యార్థిగా ఉండ తగడు అని చేర్చుకోలేదట. చిత్రంగా, ప్రస్తుతం ఇతడు పనిచేసే టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయమునకు పక్కనే ఈ పాఠశాల ఉంది. ఏ పాఠశాలలో బొమ్మలు వేయటం నేర్చుకోవటానికి ప్రవేశం లభించలేదో, అదే స్కూలు పక్కన ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కొన్ని దశాబ్దాల పాటు వారి కార్టూనిస్ట్‌గా ఉండి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవటం ఇతని అకుంఠిత దీక్షకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చివరకు ఇతని మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. చదివి పట్ట భద్రుడ‌య్యాడు. తన చదువు కొనసాగిస్తూనే బొమ్మలు ప్రీలాన్స్  చిత్రకారునిగా కొనసాగాడు. ఆ కాలంలోనె "స్వరాజ్య" అన్న పత్రికలో కార్టూన్లు వేశాడు. అలాగే, నారద అనే కార్టూన్ సినిమాకు కూడా బొమ్మలు వేశాడు.








తిరుప‌తిలో బీజేపీ- జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఆ మ‌హిళా నేత ఫిక్స్‌..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>