PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-tracters-rally3b10c88e-84a6-44b2-93e5-3b8d2f69925c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-tracters-rally3b10c88e-84a6-44b2-93e5-3b8d2f69925c-415x250-IndiaHerald.jpgఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజు భారీ స్థాయిలో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించేందుకు రైతుం సంఘాల నేతలు పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు కిసాన్‌ ట్రాక్టర్ పరేడ్‌ ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ట్రryali;delhi;pakistan;ghaziabad;police;capital;traffic police;central governmentఢిల్లీ ని చుట్టుముట్టిన ట్రాక్టర్లు... ఎందుకో తెలుసా...?ఢిల్లీ ని చుట్టుముట్టిన ట్రాక్టర్లు... ఎందుకో తెలుసా...?ryali;delhi;pakistan;ghaziabad;police;capital;traffic police;central governmentTue, 26 Jan 2021 10:19:58 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజు భారీ స్థాయిలో ట్రాక్టర్ పరేడ్ నిర్వహించేందుకు రైతుం సంఘాల నేతలు పిలుపునిచ్చారు.  రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.ఒకవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు కిసాన్‌ ట్రాక్టర్ పరేడ్‌ ఒకేరోజు రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్ మార్చ్ కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ ర్యాలీకి అనుమతినిచ్చారు ఢిల్లీ పోలీసులు. మూడు రూట్లలో మాత్రమే ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. తమ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించాలని సూచించారు పోలీసులు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌లో, రైతులు ట్రాక్టర్‌ పరేడ్‌ తలపెట్టిన మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాతే ట్రాక్టర్‌ పరేడ్‌ ప్రారంభిస్తామని, సెంట్రల్‌ ఢిల్లీలోకి ప్రవేశించబోమని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ పరేడ్‌లో దాదాపు 2 లక్షల ట్రాక్టర్లు, రైతుల శకటాలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.ట్రాక్టర్ ర్యాలీలో మరే ఇతర వాహానాలను గానీ ప్రదర్శించకూడదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎడ్ల బండ్లు, ఒంటెల బండ్లు, ఆటోలు, జేసీబీలు, ఇతర వ్యవసాయాధారిత వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

టిక్రి వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే ట్రాక్టర్లు నంగ్లోయ్, నజఫ్‌గఢ్, వెస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ మీదుగా బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే ఘాజీపూర్ వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు 56 ఫీట్ రోడ్ వరకు వెళ్లి మళ్లీ కుండ్లీ-ఘజియాబాద్, పల్వల్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. సింఘు సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ట్రాక్టర్లు.. కంఝావాలా, బవానా, ఔచండి బోర్డర్, కేఎంపీ ఎక్స్‌ప్రెస్ మీదుగా వెళ్లి.. మళ్లీ ఇదే సింఘు బోర్డర్ నుంచి బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుందని ఢిల్లీ స్పెషల్ ఇంటెలిజెన్స్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు.


కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>